మల్లంపల్లి చంద్రశేఖర వీరభద్ర వరప్రసాద్ - ఈ పేరు చెబితే చాలామందికి తెలియదేమో ! ఈయన ఒకప్పుడు ఏలూరులో వ్యవసాయ శాఖలో పనిచేసారు. అప్పుడాయనకి తన ఉద్యోగం, తన లోకమే తప్ప మరో ప్రపంచం తెలీదు.అలాంటి సాదా సీదా ప్రభుత్వోద్యోగి తర్వాత ఎంతో ఎత్తుకి ఎదిగారు. అంటే దానర్థం ఆయన పొడుగు పెరిగారని కాదు. ఆ మాట కొస్తే ఆయన పొడుగు అయిదు అడుగులు మించలేదు. అయినా ప్రతిభకు ఒడ్డూ పొడుగూ అడ్డు కాదని నిరూపించారు.
Vol. No. 02 Pub. No. 238
చాలా ఏళ్ళ తర్వాత 2005 లోననుకుంటాను. హైదరాబాద్ లో వున్న ఆయనింటికి ఓ మిత్రునితో కలసి వెళ్ళడం జరిగింది. ఆ ఇల్లు ఆ ప్రాంతం లోని ఇళ్ళతో పోలిస్తే చిన్నదే ! కానీ చూడ ముచ్చటగా వుంది. ఆయనకీ మంచి అభిరుచి వుంది అనుకుంటూ లోపలికి అడుగు పెట్టాను. హాలు పెద్దదే ! కానీ హాల్లో ఫర్నిచర్ ఏమీ కనబడలేదు. నాలుగయిదు ప్లాస్టిక్ కుర్చీలు, ఓ ప్రక్కగా ఓ పాత చెక్క టేబుల్, దాని ముందు మరో పాత వైర్ కుర్చీ, అందులో ఓ సాధారణ లుంగీ, బనియన్ తో ఆయన ఏదో రాసుకుంటూ కనిపించారు. పరిచయాలయ్యాయి. గతంలో ఆయనతో వున్న చిన్నపాటి పరిచయాన్ని గుర్తుచేసి, నా నేపథ్యం చెప్పగానే ఆయన చాలా ఆప్యాయంగా మాట్లాడారు. ఆ తర్వాత అనుకోకుండా నేను ఆ ఇంట్లోనే ఆయనతో బాటు కొన్ని రోజులు ఉండాల్సి వచ్చింది. అప్పటికే ఎంతో ప్రసిద్ధుడు, అంతు తెలియని ఆస్తిపరుడు అయిన ఆయన నిరాడంబర జీవనం నన్ను ఆశ్చర్యపరచింది. ముఖ్యంగా ఆయన నేను అక్కడ వున్నన్ని రోజులు నా పట్ల కనబరిచిన శ్రద్ధ మరచిపోలేను. నేను ఉదయం లేవగానే కాఫీ తాగానా లేదా అనేదానితో ప్రారంభించి రాత్రి ఏ సమయంలో వచ్చినా ఏమైనా తిన్నానా లేదా అని అడగడం నిజంగా ఆ స్థాయిలో వున్న ఏ వ్యక్తీ నుంచి ఆశించలేము.
ఆయన గురించి కొన్ని అపోహలున్నాయి. ఆయన చాలా పిసినారి అని, ఎంత సంపాదించినా అనుభవించడం చేతకాదని ఇప్పటికీ అందరూ చెప్పుకుంటారు. నిజమే ఆయన్ని దూరం నుండి చూసేవాళ్ళకి అలాగే కనిపిస్తారు. మొదట్లో ఆయన జీవనశైలి చూసి నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ ఆయనతో కొన్ని రోజులు గడిపిన అనుభవం, ఆయన చెప్పిన కొన్ని విషయాలు నా అభిప్రాయాన్ని మార్చాయి. ఆ పిసినారితనం వెనుక ఆయన ఆలోచనలు తెలిసాయి. అవి జీవితసారాలు. ఆయన జీవితమే కాక ఇతరుల జీవితాలు, వారి స్థితిగతులు ఎంత నిశితంగా గమనిస్తారో అప్పుడే అర్థమయింది. ఒకరకంగా చెప్పాలంటే ఆయన మంచి ఆర్థికవేత్త. సంపాదించే ప్రతి రూపాయిలో ఎంత ఖర్చుపెట్టాలి, ఎలా ఖర్చుపెట్టాలి, ఎంత పొదుపు చెయ్యాలి అనే విషయాల్లో ఆయనకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక వుంది. తన చుట్టూ వున్న వ్యక్తుల వైఫల్యాలను తన విజయాలకు మెట్లుగా ఉపయోగించుకున్నారు. ఆడంబరాలకు, వ్యసనాలకు లోనై తాము చివరిదశలో నరకం అనుభవించడమే కాక తమ కుటుంబాలను వీధి పాలు చేసిన ఎందరినో నిశితంగా గమనించారు. అందుకే వాటన్నిటికీ దూరంగా ఉంటూ నలభై అయిదు సంవత్సరాలుగా ఓటమి, విశ్రాంతి అన్నది ఎరుగకుండా సాగిపోతున్నారు.
ఆయనే........ 1966 లో చిత్రసీమలో ప్రవేశించి ఇప్పటివరకూ విశ్రాంతి అన్నది లేకుండా పనిచేస్తున్న విలక్షణ నటుడు చంద్రమోహన్.
ఆయన సహజ నటుడు. ఏ నటనానుభవం లేకుండా బి. యన్. రెడ్డి గారి ' రంగులరాట్నం ' చిత్రంతో ప్రారంభించి కథానాయికుడు, ప్రతినాయకుడు, సహాయనటుడు, క్యారెక్టర్ నటుడిగా.....ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు..... పోషిస్తున్నారు.... పోషిస్తూనే వుంటారు.
నిన్న ( మే 23 ) చంద్రమోహన్ గారి జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు
Vol. No. 02 Pub. No. 238
7 comments:
I join you in greeting Chandramohan garu on the occassion of his birthday. About more than two years back I happened to interview him, along with his wife, in the studio of AIR, Chennai for FM Rainbow.He was down to earth. He also sang the pallavi of Ghantasala's ' raagamayi raave ' from Jayabheri.
క్లుప్తంగా చెప్పాలంటే చంద్రమోహన్ యస్వీఆర్ కి మీనియేచర్ రూపం.
@ రాజేంద్ర కుమార్ గారు క్షమించాలి మీతో నేను ఏకీభవించలేకపోతున్నాను. చంద్ర మోహన్ గారు మంచి నటుడే కానీ మినీ యస్వీఆర్ అనదగ్గ మహా నటుడు కాదని నా అభిప్రాయం.
అయ్యో శంకర్ గారు క్షమాపణలూ అవీ యెందుకండీ బాబు,చంద్రమోహన్ మంచి నటుడు అనాలంటే ఒక మంచి పోలికకోసం వాడానా మాట.ఉదాహరణకు ఘంటసాలలా పాడుతున్నాడు,సావిత్రిని గుర్తుకుతెచ్చింది ఇలాంటి అన్నమాట.
అంటే ఆ పోలిక నాకు రాహుల్ గాంధీని మినీ మహాత్మా గాంధీతో పోల్చినట్టు అనిపించి రెస్పాండ్ అయ్యాను. నిజం చెప్పాలంటే మీరు ఆ పోలిక పోల్చగానే ఒక్కసారి దుర్యోధనుడి పాత్రలో ఎస్వీఆర్ బదులు చంద్రమోహన్ ని ఊహించుకున్నాను. నాకే భయమేసి వెంటనే మీ కామెంట్ కి రిప్లై ఇచ్చాను. :)
* మాధురి గారూ !
ధన్యవాదాలు.
* రాజేంద్రకుమార్ గారూ !
* శంకర్ గారూ !
ముందుగా ధన్యవాదాలు. ఇలా ఒకరిని మరొకరితో పోల్చుకోవడం కంటే ఎవరి ప్రతిభ వారిది అనుకోవడంలోనే హాయి వుందేమో ! ఎందుకంటే ఇద్దరూ మంచినటులే ! ఒకరి పాత్రల్లో మరొకరు ఇమడరు. అందుకే ఎవరి పాత్రలు వారు ధరించి మనల్ని అలరించారు.
natana annadi haddulu leni samudram laaantidi. ikkada ilaa untundi, ani parimitulu vidhinchalam iddaruu natanalo vaacakamlo, bhaava prkatanalo uddandule, evari tiiru vaaridi evari ghanata vaaridi. ila polchi ceppakuudadu.
Post a Comment