మానవులంతా ఒకటని చాటే మరో ప్రపంచం పిలిచింది
శ్రామిక లోకమంతా ఒకటేనని ఎలుగెత్తి చాటింది
తమ ఐకమత్యమే తమ బలమని నిరూపించింది
కార్మిక శక్తికి ఎదురనేదే లేదని నిరూపించిన రోజు
కార్మికులే నవయుగ నిర్మాతలని నిరూపించిన రోజు
కార్మికలోకం గెలిచినరోజు
అరుణ పతాకం ఎగిరినరోజు
ఆ రోజే.... ఆ రోజే... మేడే
నేడే... నేడే.... మేడే
కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక సోదరులందరికీ శుభాకాంక్షలు
మహాకవి శ్రీశ్రీ సాహిత్యం కే. వి. మహదేవన్ స్వరకల్పనలో ' మనుషులు మారాలి ' చిత్రంలోని పాట.....
Vol. No. 02 Pub. No. 218
2 comments:
రావు గారు, ఈ పాటవిని కొన్ని దశాబ్దాలయింది. ఇన్నేళ్ళతరువాత వింటుంటే గత స్మృతులు ఎక్కడకో తీసుకుపోయాయి. అందులోను మహాకవి శ్రీశ్రీ రచనలు ఎంతో భావోద్వేగాన్ని కలిగిస్తాయి. ఆ మహామహుని, ఆయన రచనలను "మే డే" సందర్భంగా గుర్తు చేస్తున్నందుకు ధన్య వాదాలు. ఈ పాట లిరిక్స్ కూడ ఇస్తే బాగుండేది.
సూరి గారూ !
ధన్యవాదాలు. తప్పకుండా మీ సూచనమేరకు మరోసారి సాహిత్యం ఇస్తాను.
Post a Comment