ఒకసారి హాస్యనటుడు పద్మనాభం కృష్ణా జిల్లా కైకలూరులో తన బృందంతో ' శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యం ' నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇంతలో కొంతమంది కుర్రాళ్ళు అక్కడికి చేరుకున్నారు. నాటకం చూడాలి. ఎలా ? తమ దగ్గర డబ్బులు లేవు. టికెట్ లేకపోతే లోనికి రానివ్వరు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఎలాగైనా నాటకం చూడాలి.
ఇంతలో ఆ బృందానికి నాయకత్వం వహిస్తున్న యువకుడికి ఓ ఆలోచన వచ్చింది. అంతే ఓ ఇనుప తీగ సంపాదించి ఆ నాటకం ప్రదర్శిస్తున్న హాలుకి విద్యుత్ సరఫరా చేస్తున్న తీగలపైకి విసిరాడు. ఇంకేముంది..... లైవ్, న్యూట్రల్ వైర్లు కలిసిపోయి హాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. నాటకం మొదలు కాలేదు. సిబ్బంది విషయాన్ని గమనించి సరిచేసి విద్యుత్ సరఫరా పునరిద్ధరించడానికి అరగంట పట్టింది. ఈలోపు హాలంతా గందరగోళం. సందట్లో సడేమియాలాగ చీకట్లో ఈ మిత్రబృందం హాల్లో జొరబడ్డారు. నాటకం మొదలయ్యింది. హాయిగా కూర్చుని ఆసాంతం చూసి ఆనందించిన ఆ మిత్రబృందానికి సారధ్యం వహించిందీ, విద్యుత్ సరఫరా ఆగిపోయేటట్లు చేసిందీ వరప్రసాద్ అనే అబ్బాయి. ఇది జరిగింది 1961 వ సంవత్సరంలో.... అతనే తరవాత కాలంలో అనేక నాటకాలు వేసి, ఆపైన సినిమా నటుడిగా విజృభించాడు.
విపత్కర పరిస్థితుల్ని కూడా ధైర్యంగా ఎదుర్కొన్నాడు.
వైకల్యాలను సౌకర్యాలుగా చేసుకున్నాడు
అపజయంలోనూ విజయాన్ని సాధించాడు
తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాడు
ఆయన అభినయంలో సహజత్వం ఉట్టిపడుతుంది
ఆయన వాచికంలో విరుపులు మలుపులు తిరుగుతాయి
ఆయన నటనలో నవరసాలు నాట్యమాడతాయి
ఆయన గళంలో సంభాషణలు విన్యాసాలు చేస్తాయి
ఆయనకు అపజయమేమిటి ?
ఆయనకు వైకల్యమేమిటి ?
అసలైన కళాకారుడు ఓటమిని అంగీకరించాడు
ఓటమిలోనే గెలుపును వెదుక్కుంటాడు
నూతన్ ప్రసాద్ కూడా అదే చేసాడు. ఆయన నట జీవితాన్ని బలి తీసుకుందనుకున్న విధిని ఎదిరించాడు. గెలిచాడు. ప్రమాదవశాత్తూ వచ్చిన వైకల్యం శరీరానికే కానీ నటనకు కాదని నిరూపించాడు. తర్వాత కొన్ని చోట్ల ఆయన నటించాడు. మరికొన్నిచోట్ల ఆయన స్వరం నటించింది. నటుడిగా ప్రేక్షకులను అలరించాడు. ఆయన నటన అజరామరం. తెలుగు చిత్రసీమ ఉన్నంతవరకూ నిలిచి వుంటుంది. అలాంటి వైవిధ్యమున్న నటులు ఇటీవలి కాలంలో అరుదు.
నూతన్ ప్రసాద్ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ................
' చలిచీమలు ' చిత్రంలో తుమ్మలపాటి చినపద్దయ్య గా నూతన్ ప్రసాద్ సంభాషణలు వినండి......

ఆయన నటన తెలుగు తెరకు నిత్యనూతన ప్రసాదం
ఆయన లేకపోయినా ఆయన నటన కలకాలం నిలిచే వుంటుంది
నూతన్ ప్రసాద్ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ................
Vol. No. 02 Pub. No. 187