మహాకవి
అనుపమ ఫిల్మ్స్ బ్యానర్ పైన దర్శక నిర్మాత కె. బి. తిలక్ నిర్మించిన చిత్రం ' భూమి
కోసం ' లోనిదీ పాట. ఘంటసాల గారు చివరి రోజుల్లో పాడిన పాటల్లో ఇది కూడా ఒకటి. ఈ చిత్రానికి పేరు పెట్టింది శ్రీ శ్రీ గారేనట. పెండ్యాల నాగేశ్వర రావు సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని తిలక్ గారి సోదరుడు కె. రామనరసింహ రావు ( నక్సలైట్ ) కు అంకితమిచ్చారు. తిలక్ గారు ఒక ఐరిష్ రచయిత రాసిన LAND అనే నవలను శ్రీ శ్రీ గారికిస్తే ఆయన దాన్ని మన తెలుగు వాతావరణానికి అన్వయిస్తూ చలన చిత్ర కథగా మార్చారు. ఈ పాటలో గుమ్మడి నటించారు. ఈ చిత్రం ద్వారానే ప్రభ, జయప్రద పరిచయమయ్యారు. అయితే తర్వాత ప్రభ నటించిన ' నీడలేని ఆడది ' ముందుగా విడుదలయింది.రేపు, ఎల్లుండి ( మార్చి 8, 9 తేదీలలో ) చెన్నై లో శ్రీ శ్రీ సాహిత్య సదస్సులు జరుగనున్నాయి. ఆ సందర్భంగా ఆ మహాకవిని మరోసారి జ్ఞప్తికి తెచ్చుకుంటూ........
Vol. No. 01 Pub. No. 216
6 comments:
నేను ఇదివరకూ ఎప్పుడూ వినని కొత్త విషయాలు తెలియజేస్తున్నారు. థాంక్యూ...
nice song.....thx sir......
నిజమే అప్పటికీ ఇప్పటికీ
పరిస్థితుల్లో ఏ మార్పు లేదు. అవును ఈ సినిమా ఎప్పుడు విడుదలయిందండి. మంచి పాటను పరిచయం చే్సారు.
* రవిచంద్ర గారూ !
* వినయ్ చక్రవర్తి గారూ !
ధన్యవాదాలు
* శ్రీనిక గారూ !
ధన్యవాదాలు. ఈ చిత్రం 1974 వ సంవత్సరంలో విడుదలైందండీ !
atleast 50 times vinivuntaanu song meeru post chesina taruvata what a lyrics.....
awesome voice of ghantasala
వినయ్ చక్రవర్తి గారూ !
పాట నచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పటి తరానికి తెలియని మంచి పాటలెన్నో వున్నాయి. వీలయినంతవరకూ వాటిని పరిచయం చెయ్యడానికి ప్రయత్నిస్తాను.
Post a Comment