మహాకవి శ్రీ శ్రీ రాసిన మంచి పాటల్లో ఇది కూడా ఒకటి. ప్రబోధాత్మక గీతం.శ్రీ శ్రీ ఈ పాటలో చెప్పిన పంతుళ్ల పరిస్థితుల్లో ఇప్పుడు కొంత మార్పు వచ్చిందేమో గానీ చదువులో పెద్ద మార్పు కనబడదు. మిగిలిన పూరిగుడిసెల, పేదల కాలే కడుపుల , మందులు లేని ఆసుపత్రుల, మూఢాచారాలకు, ఇతరత్రా అన్యాయంగా బలైపోయే పడతుల, దురాశ, దురలవాట్లకు బానిసలై పోయే వాళ్ళ , సేద్యం లేక పనుల్లేని రైతు కూలీల, శ్రమకు తగ్గ ఫలితం దక్కని శ్రమజీవుల పరిస్థితుల్లో అప్పటికీ, ఇప్పటికీ చెప్పుకోదగ్గ మార్పు రాలే్దు. అందుకే ఆయన ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడద్దంటారు.
అనుపమ ఫిల్మ్స్ బ్యానర్ పైన దర్శక నిర్మాత కె. బి. తిలక్ నిర్మించిన చిత్రం ' భూమికోసం ' లోనిదీ పాట. ఘంటసాల గారు చివరి రోజుల్లో పాడిన పాటల్లో ఇది కూడా ఒకటి. ఈ చిత్రానికి పేరు పెట్టింది శ్రీ శ్రీ గారేనట. పెండ్యాల నాగేశ్వర రావు సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని తిలక్ గారి సోదరుడు కె. రామనరసింహ రావు ( నక్సలైట్ ) కు అంకితమిచ్చారు. తిలక్ గారు ఒక ఐరిష్ రచయిత రాసిన LAND అనే నవలను శ్రీ శ్రీ గారికిస్తే ఆయన దాన్ని మన తెలుగు వాతావరణానికి అన్వయిస్తూ చలన చిత్ర కథగా మార్చారు. ఈ పాటలో గుమ్మడి నటించారు. ఈ చిత్రం ద్వారానే ప్రభ, జయప్రద పరిచయమయ్యారు. అయితే తర్వాత ప్రభ నటించిన ' నీడలేని ఆడది ' ముందుగా విడుదలయింది.
రేపు, ఎల్లుండి ( మార్చి 8, 9 తేదీలలో ) చెన్నై లో శ్రీ శ్రీ సాహిత్య సదస్సులు జరుగనున్నాయి. ఆ సందర్భంగా ఆ మహాకవిని మరోసారి జ్ఞప్తికి తెచ్చుకుంటూ........
Vol. No. 01 Pub. No. 216
6 comments:
నేను ఇదివరకూ ఎప్పుడూ వినని కొత్త విషయాలు తెలియజేస్తున్నారు. థాంక్యూ...
nice song.....thx sir......
నిజమే అప్పటికీ ఇప్పటికీ
పరిస్థితుల్లో ఏ మార్పు లేదు. అవును ఈ సినిమా ఎప్పుడు విడుదలయిందండి. మంచి పాటను పరిచయం చే్సారు.
* రవిచంద్ర గారూ !
* వినయ్ చక్రవర్తి గారూ !
ధన్యవాదాలు
* శ్రీనిక గారూ !
ధన్యవాదాలు. ఈ చిత్రం 1974 వ సంవత్సరంలో విడుదలైందండీ !
atleast 50 times vinivuntaanu song meeru post chesina taruvata what a lyrics.....
awesome voice of ghantasala
వినయ్ చక్రవర్తి గారూ !
పాట నచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పటి తరానికి తెలియని మంచి పాటలెన్నో వున్నాయి. వీలయినంతవరకూ వాటిని పరిచయం చెయ్యడానికి ప్రయత్నిస్తాను.
Post a Comment