Monday, March 29, 2010

అపర త్యాగయ్య

నాగదేవత శర్మ దంపతులకు ప్రసాదించింది నాగేశ్వర్ ని
నటరాజు తెలుగు ప్రేక్షకులకు ప్రసాదించాడు నాగయ్యను
కాదు... కాదు..... అపర త్యాగయ్యను

ఆంగికం, వాచికం, ఆహార్యం నాగయ్య సొత్తు
అదే అలరించింది తెలుగువారిని యావత్తు
తెలుగుచిత్ర చరిత్రలో చెదిరిపోని జ్ఞాపకం నాగయ్య
అందుకే అయ్యాడు తెలుగు వారికి అతడు మరో త్యాగయ్య


జాలి, దయ, పరోపకారాలే నిజమైన నిధులని నమ్మి
తనకున్న నిధినంతా దానధర్మాలు చేసేసి
అంతులేని కీర్తి అనే పెన్నిధి స్వంతం చేసుకుని.......

నిధి చాలా సుఖమా !
రాముని సన్నిధి చాలా సుఖమా !!


అంటూ రాముని సన్నిధికి చేరిన అపర త్యాగయ్య ' నాగయ్య ' గారి జన్మదినం సందర్భంగా ఆయనకు స్మ్రత్యంజలి
నాగయ్య గారిపై గతంలో రాసిన టపా నాన్నగారు నాగయ్య

Vol. No. 01 Pub. No. 238

12 comments:

శివ said...

అద్భుతం రావుగారూ. అతి కొద్ది మాటలలో నాగయ్య గారిని వర్ణించారు. అభినందనలు. ఆ మహా కళాకారుతినికి రావలిసిన గుర్తింపు రాలేదు.

Anonymous said...

Nagaiah got due recognition for his shaky actions.

Rao S Lakkaraju said...

మనము జీవితము లో సంపాదించే విద్య దానం ఎవరో మనకు ప్రసాదిన్చినవే. వాటిని మరల తిరిగి పంచటం మన విజ్ఞత. దానికి నాగయ్య గారు స్ఫూర్తి. స్వర్గ సీమ లోని మీకు నా వందనాలు.

sowmya said...

చాలా బాగా వర్ణించారండీ.నిజంగా ఆయన అపర త్యాగయ్యే. అంతే కాదు అపర వేమన కూడా. వేమన సినెమాలో ఆయన జీవించారు.

సరదాగా ఓ చిన్న సంఘటన -
మా పెద్దనాన్నగరికి నాగయ్యగారంటే చాలా ఇష్టం. వారి పిల్లలకి, మాకు కూడా నాగయ్యగారి రుచి ని చూపించారు. వారి పెద్ద కుమారుడు (నాకు అన్నయ్య) 12 యేళ్ళ వయసులో ఉన్నప్పుడు మా వీధిలో ఒక మేజిక్ షో జరిగిందట. అప్పుట్లో అందరు NTR అభిమానులే. NTR హవా గొప్ప గా సాగుతున్న రోజులవి. ఆ రోజు మేజిక్షోలో మా అన్నయ్యని స్టేజి మీదకి పిలిచి, హిప్నాటిజం ద్వారా కాస్త మత్తు కలిగించి, నీకిష్టమైన నటుడెవరు అని అడిగితే "నాగయ్య అని చెప్పారట. అందరు నోళ్ళు వెళ్ళబెట్టారట. సహజం గా NTR అనో ANR అనో చెప్తాడని అనుకున్నరట. 12 యేళ్ళ వయసు పిల్లాడు తన అభిమాన నటుడు నాగయ్య అని చెప్పడంతో అక్కడున్నవారందరికి మతిపోయినంతపనయింది. ఇది చూస్తున్న మా పెద్దనన్నగారికి మాత్రం సంతోషానికి పట్టపగ్గాల్లేవు. ఇప్పటికీ మా అన్నయ్యకు నాగయ్య గారే అభిమాన నటుడే సుమండీ

నాగయ్యగారిని గుర్తు చేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు.

Anonymous said...

పరమ సాత్వికతను అభినయించటంలో ఆయన తరువాతే ఎవరైనా. త్యాగయ్య పాటలను ఆయన పాడినతీరు పండిత పామరులను ఒకే విధంగా ఆకట్టుకుంటుందనటంలో సందేహం లేదు.

SRRao said...

* శివ గారూ !
* రావు గారూ !
ధన్యవాదాలు

* అజ్ఞాత గార్లకు
ధన్యవాదాలు. మీ పేర్లు రాసుంటే ఇంకా బాగుండేది.

* సౌమ్య గారూ !
మీ అనుభవం అద్భుతం. అప్పట్లో నాగయ్య గారి అభిమానులేలా ఉండేవారనే దానికి మీరు చెప్పిన సంఘటనే నిదర్శనం. ధన్యవాదాలు.

కొత్త పాళీ said...

నాగయ్య గారు గొప్ప నటుడు - అస్సలు సందేహం లేదు. ఈ నాటి వారికి చాలామందికి తెలీని రహస్యం ఆయన తరుణ వయసులో గ్లామర్ స్టార్ గా చాలా ప్రసిద్ధికెక్కారు - ట.

Rao S Lakkaraju said...

@కొత్త పాళీ గారు స్వర్గ సీమ సినిమా లో ఆయన హీరో హీరోయిన్ భానుమతి అనుకుంటా. మంచి సంగీత విద్వాంసుడు, చివరి రోజుల్లో పాట కచేరీలు చెయ్యాల్సొచ్చింది జీవనానికి. తల్చుకుంటే బాధ వేస్తుంది.

SRRao said...

* కొత్తపాళీ గారూ !
ధన్యవాదాలు. ఆయన అప్పట్లో గ్లామర్ స్టార్ మాత్రమే కాదు, తెలుగులో తొలి సూపర్ స్టార్ కూడా ! 1950 కు ముందే లక్ష రూపాయల భారీ పారితోషికాన్ని తీసుకున్న ఏకైక నటుడు. నా గత టపా ' నాన్నగారు నాగయ్య ' లో ఆయన గురించి ముఖ్యమైన వివరాలున్నాయి.

* రావు గారూ !
స్వర్గసీమలో భానుమతిగారిది నెగటివ్ హీరోయిన్ పాత్ర. మరో హీరోయిన్ బి. జయమ్మ. ఆయన సంపాదించిందంతా ఇతరులకు ఖర్చు పెట్టేసి ' నేను చనిపోయిన తర్వాత దహన సంస్కారాలకి చందాలేసుకోవాల్సి వస్తుంది ' అని చెప్పారట.

Rao S Lakkaraju said...

SRRao గారూ: నేను అయిదవ క్లాస్సు చదివేటప్పుడు కట్టేవరం నుండి తెనాలి నడుచుకుంటూ వెళ్లి స్వర్గ సీమ సినిమా చూశాము.
మధుర స్మృతులు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

తృష్ణ said...

నాగయ్య గారి గురించి బాగా రాసారండీ..నాకిష్టమైన నటులలో నాగయ్యగారు ఒకరు. ఆయన స్వయంగా రాసిన స్వీయ చరిత్ర రెండు పుస్తక రూపాల్లో ప్రచురణ జరిగింది. చదివి నెలపైనే అవుతోంది. పుస్తకం గురించి రాయాలని పుస్తకాన్ని మూడు సార్లు చదవటం అయ్యింది కాని రాయటం కుదరలేదు.త్వరలోనే రాయాలని ఆకాంక్ష...

SRRao said...

తృష్ణ గారూ !
ధన్యవాదాలు. ఆ మహానటుడి గురించి ఎంత రాసినా తక్కువే ! మీ రచన కోసం ఎదురుచూస్తూ....

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం