కనుక్కోండి చూద్దాం - 11
పైన కనిపిస్తున్న చిత్రం అఖిలాంద్ర ప్రేక్షకుల్నీ, ఆబాలగోపాలాన్నీ అర్థశతాబ్దం పైబడి అలరిస్తున్న మరుపురాని, మరువలేని తెలుగు చిత్రంలోని ఒక సెట్ కి కళాదర్శకుడు వేసిన స్కెచ్.
ఆ చిత్రం ఏమిటో .... ? - మాయాబజార్
ఆ సన్నివేశం ఏమిటో ... ? - ఘటోత్కచుడి ఆశ్రమం
ఆ కళాదర్శకుడెవరో..... ? - గోఖలే ( మాయాబజార్ కి గోఖలే, కళాధర్ లిద్దరూ కళా దర్శకత్వం నిర్వహించినా ఈ స్కెచ్ మాత్రం గోఖలే గారు గీసింది. )
.................. చెప్పగలరా ?
Vol. No. 01 Pub. No. 235
10 comments:
చిత్ర౦ = మాయాబజార్
సన్నివేశం = ఘటొత్కచుల వారి డెన్
కళాదర్శకుడు = గోఖలే/కళాధర్
చిత్రం:మాయాబజార్
సన్నివేశం:ఘటోత్కచుడి అశ్రమం స్కెచ్.. మిత్రులని రక్షించాలి,శత్రువులని భక్షించాలి సన్నివేశం.
కళాదర్శకుడెవరో:గోఖలే,కళాధర్
wonderful sketch..thanks for sharing.
చిత్రం ఏవిటో, కళా దర్శకుడెవరో(బహుశా గోఖలే), దృశ్యం ఏవిటో చెప్పలేను గాని...మౌర్యులకాలం, నేను వేసుకున్న అజంతా గుహ, సాంచి, సార్నాధ్ లు కనిపిస్తున్నాయి. మొత్తానికి అమోఘమైన స్కెచ్ చూపించారు. ఇది కాపీ చేసుకోవచ్చా?
very very nice......kaani naaku chance ivvaledu kadaa..next time nenu mundugaa coment vestaanu..meru mallli question adagandi..
పైన ఇచ్చిన ఇద్దరి కామెంట్స్ చూడగానే నాకర్ధమైపోయింది ఇది మాయాబజార్ అని. అయినా కూడా నేనిలాగే చెప్పదలుచుకున్నాను. పౌరణిక సినిమాలో ఈ ప్రసిద్ధ చారిత్రక కట్టడాలు బాగా తెలిసిపోతున్నాయి.
* వి.జే. గారూ !
* అన్వేషి గారూ !
ధన్యవాదాలు.
* జయ గారూ !
చిరకాల స్పందన. చాలా సంతోషం. మీకు తెలియదంటూనే స్కెచ్ గీసిన కళా దర్శకుణ్ణి బాగానే ఊహించారు. కాపీ రైట్ నాది కూడా కాదు కనుక కాపీ చేసుకోవడానికి ఆలస్యమెందుకు ? కాకపోతే పంతులమ్మగారు జవాబుల్ని కాపీ కొట్టినట్లు కాకుండా బాగానే మేనేజ్ చేస్తున్నారు. ధన్యవాదాలు.
* సుభద్ర గారూ !
ఈసారి ' కనుక్కోండి చూద్దాం ' శీర్షికకు ప్రశ్న అడిగేటప్పుడు కామెంట్ మోడరేషన్ పెడతాను. దాంతో మీరే ఫస్ట్ అవుతారు. ఎంతైనా మా కోనసీమ ఆడపడచు కదా ! ధన్యవాదాలు.
రావ్ గారూ నేను కాపీ కొట్టే పంతులమ్మని కానండోయ్. నేను కామెంట్ చేసేప్పుడు పైన ఉన్న కామెంట్స్ నాకు కనిపించవా? మీరు మొడరేషన్ పెట్టుకోలేదుగా. కాకపోతే అది నా ఫీలింగ్ మాత్రమే. ఒక్క మాట చెప్పండి. నేను చెప్పిన వేవీ ఆ ద్రుశ్యంలో కనిపించటం లేదా!
జయ గారూ !
అపార్థం చేసుకోకండి. నేను మేనేజ్ చేశారన్నది గోఖలే గారి గురించి మీ వూహ విషయం. అది కూడా సరిగా వూహించగలిగారన్న ఆనందంతో సరదాకి అన్నాను. నొప్పిస్తే మన్నించండి. నిజంగా నాకు ఆ స్కెచ్ అద్భుత కళాఖండంలాగా కనిపించడం వలనే మీకందరికీ చూపిద్దామనిపించింది. మీరు దానిలో మరిన్ని కోణాలు దర్శించగలిగారు. ఎంతైనా చిత్రకారిణి కదా !
అయ్యో!!! శ్రీ రామచంద్ర మూర్తీ:) :)
జయ గారూ !
పోన్లెండి. ఈ వంకనైనా ఆ శ్రీరామచంద్రుణ్ణి తల్చుకున్నారు.
Post a Comment