కులం కులం అని కుఛ్ఛితాలు పెంచుకోకు
ఓ కూటికి లేనివాడా మనదంతా ఒకే కులం అదే అదే మనిషి కులం [కులం]
మతం మతం అని మాత్సర్యం పెంచుకోకు
ఓ సమతా మానవుడా మనదంతా ఒకే మతం అదే అదే మనిషి అభిమతం [కులం]
నాదినాది అని వాదులాట పెంచుకోకు
ఓ డొక్కలైన నిండనోడా మనదంతా ఒకే శక్తి అదే అదే మనిషి శ్రమశక్తి [కులం]
ఈ పాట 1982 లో సి విజయలక్ష్మిగారు విప్లవ శంఖం సినిమా కోసం రాసింది.చక్రవర్తి సంగీతం.
Vol. No. 01 Pub. No. 221
7 comments:
ఈ పాట 1964 లో సి విజయలక్ష్మిగారు విప్లవ శంఖం సినిమా కోసం...?!...ఈ పాట 1974 కాలం నాటిది అనుకుంటున్నాను...!
ధరణి రాయ్ గారూ !
నిజమేనండీ ! రహమతుల్లా గారు పంపిన మెయిల్ పేస్టు చేసాను గానీ నేను కూడా గమనించలేదు. కానీ 'విప్లవశంఖం' 1982 లో విడుదలైంది. సరిచేసాను. మీ సవరణకు కృతజ్ఞతలు.
మూఢనమ్మకాలను పారద్రోలే ఇలాంటి మంచి పాటలను వెలుగులోకి తెండి.
"నారాయణ నారాయణ అల్లా అల్లా", "ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవము?" అనే పాటలు పూర్తిగా మీ దగ్గర ఉంటే ప్రచురించగలరు
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ అల్లా అల్లా
మా పాలిట తండ్రీ నీ పిల్లలమేమెల్లా || నారాయణ ||
మతమన్నది నాకంటికి మసకైతే
మతమన్నది నా మనసుకు మబ్బైతే
మతం వద్దు గితం వద్దు మాయామర్మం వద్దు || నారాయణ ||
ద్వేషాలు రోషాలు తెచ్చేదే మతమైతే
కలహాలు కక్షలు కలిగించేదే గతమైతే
మతం వద్దు గతం వద్దు
మారణ హొమం వద్దు || నారాయణ||
మతమన్నది గాంధీజీ హితమైతే
మతమన్నది లోకానికి హితమైతే
హిందువులం ముస్లిములం
అందరము మానవులం,
అందరమూ సోదరులం || నారాయణ ||
---దేవులపల్లి కృష్ణశాస్త్రి
ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవమూ
ఎల్లమతముల సారమొకటే
తోటకెల్ల వసంతుడొకడే
.......గుడి గంట ఒకటే
ఈ పాట బహుశా సినారె గారు రాశారనుకుంటా.మొత్తం పాట తెలిసినవారు బ్లాగులో పెట్టండి.
అందరికీ ఒక్కడే దేవుడు
కొందరికి రహీము కొందరికి రాముడు
ఏ పేరున పిలిచినా దేవుడు ఒక్కడే దేవుడొక్కడే [[అందరికీ]]
పూలలో ఉన్నాయి వేలరకాలు
పక్షులలో ఉన్నాయి లక్షవిధాలు
రేకులు ఉంటేనే పువ్వంటాము
రెక్కలు ఉంటేనే పక్షంటాము
మతాలు ఏవైనా కులాలు వేరైనా
మంచిమనసు ఉంటేనే మనిషంటాము
మనుషులమై మనమంతా కలిసుంటాము [[అందరికీ]]
పై వేషం చూసి నీవు భ్రమపడరాదు
మేడిపండు మెరుగంతా మేలిమికాదు
ఎక్కడో దేవునికై ఎందుకు వెదికేవు?
పక్కనున్న మానవుని ఎందుకు మరిచేవు?
మానవసేవే మాధవ సేవ
బాధపడే సోదరులను ఆదుకునేను
మనుషులమై మనమంతా కలిసుంటాము [[అందరికీ]]
కష్టపడే నీతిపరుని కడుపు నిండదు
దోచుకునే దొరగారికి తృప్తి ఉండదు
స్వార్ధపరుల ఆట మనం కట్టిస్తాము
శ్రమజీవుల కష్తఫలం ఇప్పిస్తాము
అహింస బోధిస్తాం ప్రశాంతి సాధిస్తాం
లోకంలో ఆకలే లేకుండా చేస్తాము
మనుషులమై మనమంతా కలిసుంటాము [[అందరికీ]]
--- ఒకటే కుటుంబం
మారదు మారదు మనుషులతత్వం
మారదు
మాటలతోటి మారిందనుకుని ఎవ్వరు
భ్రమపడకూడదు [[మారదు]]
సూర్య చంద్రులూ మారలేదులే
చుక్కలు మొలవకా మానలేదులే
మనిషికి ఉన్నా స్వార్ధపరత్వం
మారటమంటే సుళువుకాదులే
[[మారదు]]
పైసా ఉంటే అందరుమాకు
బంధువులంటారు
పైసాపోతే కన్నబిడ్డలే చీపో
అంటారు చెవులకు చేటలు కడతారు
[[మారదు]]
కాసుపడనిదే తాళి కట్టరు
పెళ్ళిపీటపై వారు కాలు
పెట్టరు
కట్నములేనిదే ఘనతే లేదనీ
చదువుకున్నవారే కలలుకందురూ
[[మారదు]]
ఆకలికన్నం పెట్టేవాడే ఆపదలో
కాపాడేవాడే
బంధువూ అతడే బంధువూ
ఆత్మబంధువూ
Post a Comment