వలపు లొలుకుపువ్వుల్లారా !
తెలుగుతల్లివదనమ్మున
విరిసినచిరునవ్వుల్లారా !
నవతావాదుల్లారా !
మానవతావాదుల్లారా !
నవచైతన్యం ఉరకలు వేసే
యువతీయువకుల్లారా !
భారతయువతీయువకుల్లారా !
నవభారతనిర్మాతల్లారా ! "
......................................
మా గురువు గారు, కవి డాక్టర్ వక్కలంక లక్ష్మీపతిరావు గారు రచించిన దేశభక్తి గేయం అది. ఆయన అనేక లలితగీతాలు, దేశభక్తి గీతాలు రచించారు. అవి 1970-90 ప్రాంతాలలో విరివిగా ఆకాశవాణి కేంద్రాలలో వినపిస్తూ ఉండేవి. ఇప్పటికీ అప్పుడప్పుడు ఆకాశవాణి కేంద్రాలనుంచి పున: ప్రసారం అవుతూ ఉంటాయి. అప్పట్లో ఆకాశవాణి గుర్తింపు ఉన్న రచయిత. ఇవే కాక ఇంకా అనేక గ్రంథాలు రాసారు. ప్రస్తుతం వృద్ధాప్యం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నారు.
గణతంత్ర దినోత్సవం షష్టి పూర్తి చేసుకుంటోంది. ఆ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పూర్తి గేయాన్ని ఇక్కడ చూడండి .............
Vol. No. 01 Pub. No. 168
5 comments:
మంచి విషయం చెప్పారు. మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
జయ గారూ !
ధన్యవాదాలు
డా. వక్కలంక లక్ష్మీపతిరావుగారు మాకు తాతగారవుతారు. మా అమ్మగారికి మేనమామ. ఈ కాలం వాళ్లకి తెలీని ఎన్నో ప్రబంధవిశేషాలు, కనీసం అర్థంకాని కావ్య రచనా విషయాలు తెలిసిన మహాకవి ఆయన. ఆంధ్రపుణ్యక్షేత్రాలు పేరుతో ఆయన రాసిన భక్తిరాగమాలిక బాలు జానకి పాడారు. ఆయన ఇటీవలే (ఒక వారం రోజులక్రితం) పరమపదించారు. ఆయన్ని గుర్తుపెట్టుకున్నందుకు గుర్తుచేసుకున్నందుకు గుర్తు చేసినందుకు మీకు నా ధన్యవాదాలు.
వక్కలంక కిషోర్
అవునండి. శ్రీ వక్కలంక లక్ష్మీపతిరావుగారు ఈ మధ్యే పరమపదించారు. రోజులు జరుగుతున్నాయి ఇంకా.
* కిషోర్ గారూ !
గురువు గార్ని ఎలా మరచిపోగలను. ధన్యవాదాలు
* అజ్ఞాత గారూ !
ధన్యవాదాలు
Post a Comment