Saturday, January 2, 2010

'సాక్షి' పానుగంటి


పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చేవి ' సాక్షి ' ప్రసంగ వ్యాసాలు. వ్యంగ్య రచనలో ఆయనది అంది వేసిన చెయ్యి.
ఆయనోసారి ఆంధ్ర సాహిత్య పరిషత్ సభకు అధ్యక్షత వహించారు. ఆనాటి ఉపన్యాసంలో తన మీద తనే వేసుకున్న కొన్ని వ్యంగ్య బాణాలు....
" నేను పండితుడిని గానని ఈ ఉరివారెరుగుదురు. పై గ్రామం వారెరుగుదురు. సాహిత్య హీనతలో జగమెరిగినవాడను గానీ, సాధారుణుడనుగాను.
ఇట్టి నన్ను పరిషత్తువారేల ఎన్నుకొనిరో నాకు తెలియదు. వెనుక జరిగిన పది పరిషత్సభలకు పండితుల నెన్నుకుంటిమికదా ! ఈసారి ఆపండితుడి నెన్నుకుందము, ఇంతలో చెడిపోవునదేమున్నదని ఊహించి మార్పు కొరకై నన్నెన్నుకొని వుందురేమో ? ఎటులైననేమి ? అనిలంఘ్యమైన మహాజనులయాజ్ఞ తులశీ దళముల వలె శిరమున ధరించి యిట నిలవబడితిని " ...... అంటూ సాగిందట ఆ చమత్కార ప్రసంగ ప్రవాహం.

Vol. No. 01 Pub. No. 148

5 comments:

Rajan said...

వినయ శీలత, హాస్య స్పూర్తి రెండూ ప్రతిబింబించే చమక్కును అందించినందుకు ధన్యవాదములు

సూర్యుడు said...

చాలా బాగుంది

జయ said...

పానుగంటి గారి గొప్పతనం సామాన్యమైంది కాదండి. ఎన్ని ఉదాహరణలైనా సరిపోవు. బాగా చెప్పారు. కాని వాళ్ళభాష అర్ధం చెసుకోవాలంటే చాలా జాగ్రత్తగా చదవాలి. అంతా గ్రాంధికమే.

Andhra Bidda said...

సర్వే జనా సుఖినో భవంతు.
అందరికీ తెలంగాణా నామ సంవత్సర శుభాకాంక్షలు

జై తెలంగాణా !
జై జై తెలంగాణా !!
……………….

తెలంగాణ వేరైతే
దేశానికి ఆపత్తా?
తెలంగాణ వేరైతే
తెలుగుబాస మరుస్తారా?
……………………. ప్రజాకవి కాళోజీ

SRRao said...

* రాజన్ గారూ !
* మాధవ్ గారూ !
* సూర్యుడు గారూ 1
*జయ గారూ 1

ధన్యవాదాలు

* ఆంధ్రబిడ్డ గారూ !
మీరందించిన కాళోజీ గారి కవిత బాగుంది. కానీ ఇటువంటి వివాస్పాదమైన, సున్నితమైన అంశాలకు సంబంధించిన వ్యాఖ్యలు ఇతరుల వ్యక్తిగత బ్లాగుల్లో ఇచ్చేకంటే మీరే ఒక బ్లాగు ప్రారంభించి రాస్తే మరింత వివరంగా, స్పష్టంగా మీ భావాలు అందరికీ తెలియజెయ్యవచ్చు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం