Thursday, January 28, 2010
భేతాళ మాంత్రికుడి అస్తమయం
' చందమామ ' కు, తెలుగువారికి విడదీయరాని అనుబంధం. అంతగా తెలుగువారిని ప్రభావితం చేసిన పత్రిక ఇంకొకటి లేదేమో ! పేరుకి పిల్లల పత్రికయినా పెద్దల చేత కూడా విడవకుండా చదివించిన ఏకైక పత్రిక ' చందమామ ' . ఆ రోజుల్లో ఆ పత్రికలో అందరూ ముందుగా చదివేది ' భేతాళ కథలు ' . అవెంత ప్రాచుర్యం పోందాయంటే వాటి సృష్టికర్తను గురించి కూడా పాఠకులెవరూ ఆలోచించకుండా అందులో చివర్న ఇచ్చే ప్రశ్నకోసమే ఎదురుచూసి జవాబుకై ఆలోచించేంత ! ఆయన కథలే కనిపించాయి గానీ వాటి వెనుకనున్న ఆయన కనిపించలేదు.
ఆ భేతాళ కథల్ని సృష్టించిన మాంత్రికుడు శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం. చాలా సంవత్సరాల పాటు అవిశ్రాంతంగా విక్రమార్కుణ్ణి, భేతాళుడ్నీ, వారితో కూడా పాఠకుల్నీ నడిపించిన ఆయన ఇంక పై లోకంలో వారిని అలరించడానికా అన్నట్లు మనల్ని, మన లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడింక ఆయన మనకు కనిపించే అవకాశం లేదు. నిన్న అంటే బుధవారం ( 27 జనవరి 2010 ) న విజయవాడలో సుబ్రహ్మణ్యం గారు తనువు చాలించారు. తన జీవితకాలంలో ఎక్కువభాగం తెలుగు పాఠకుల్ని అలరించడానికే కృషిచేసిన దాసరి సుబ్రహ్మణ్యం గారికి నివాళులర్పిస్తూ....................
Vol. No. 01 Pub. No. 172
Subscribe to:
Post Comments (Atom)

5 comments:
May his soul rest in peace.
~sUryuDu
May he find the wonderful world's he created waiting for him in the heaven!
May his soul rest in peace.
దాసరి సుబ్రహ్మణ్యంగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
* సూర్యుడు గారూ !
* అజ్ఞాత గారూ !
* అన్ఞాత గారూ !
* విజయమోహన్ గారూ !
ధన్యవాదాలు
Post a Comment