విజయవాడకు, తెలుగు పుస్తకానికి అవినాభావ సంబంధముంది. పుస్తక ప్రియులకు ఎంతో ఇష్టమైన ప్రదేశం విజయవాడ. తెలుగు ప్రచురణల రాజధాని. తెలుగు భాషలో ఎన్నో పుస్తకాలు ఇక్కడ ప్రచురించబడ్డాయి. ఎందరో రచయితల్ని పాఠకులకు పరిచయంచేసిన, దగ్గర చేసిన నగరం విజయవాడ.
అలాగే అనేక విషయాల మీద, అనేక అంశాల మీద దేశ విదేశీ ప్రచురణలను పరిచయం చేసే ఉద్దేశ్యంతో ఇరవై సంవత్సరాల క్రితం విజయవాడలో పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది.
21 వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ పుస్తక ప్రదర్శనలోని ప్రతిభా వేదికపై 03-01-2010 ఆదివారం రోజున 'e- తెలుగు ' ఆధ్వర్యంలో కంప్యూటర్లో తెలుగు వాడకం గురించిన అవగాహనా సదస్సు నిర్వహించింది.
e- తెలుగు నిర్వాహకులు శ్రీ కశ్యప్ ( కబుర్లు ) కంప్యూటర్లో తెలుగు ఆవశ్యకతను వివరించారు. శ్రీ చక్రవర్తి ( భవదీయుడు ), శ్రీ సతీష్ కుమార్ ( సనాతన సారధి ) తెలుగు ఉపకరణాలు, వాటి వినియోగం, తెలుగులో బ్లాగ్ నిర్వహించడం గురించి సోదాహరణంగా వివరించారు.
ఈ సందర్భంగా ఇప్పటివరకూ ఆంగ్లంలో బ్లాగు నిర్వహిస్తున్న శివ అనే బ్లాగర్ తెలుగు రాయటం మీద తన సందేహాలను తీర్చుకుని తెలుగులో బ్లాగ్ ప్రారంభించడానికి చాలా ఆసక్తి కనబరిచారు.
ఆయనలాగే కంప్యూటర్ తెలుగుపై తమ సందేహాలను తీర్చుకున్న అనేకమంది ఆ వివరాలను పొందుబరచిన సి.డీ.లను, కరపత్రాలను అడిగి మరీ తీసుకోవడం కనిపించింది. అలాగే ఈ అంశంపైన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమములో e- తెలుగు నిర్వాహకులు శ్రీ కాశ్యప్, శ్రీ చక్రవర్తి, శ్రీ సతీష్, ఇంకా కొందరు e- తెలుగు సభ్యులతో బాటు విజయవాడ నుంచి నవ్వులాట శ్రీకాంత్, శిరాకదంబం, తెలుగుకళ పద్మకళ, జాగృతి ప్రసాద్ మొదలైన బ్లాగర్లు కూడా పాల్గొన్నారు.
కొస మెరుపు : ఈ అవగాహనా సదస్సు విజయవంతం అయిందనడానికి ఋజువు -
ఈ సభలో పాల్గొన్న వారిలో ఇంతకు ముందు బ్లాగ్ ల గురించి, కంప్యూటర్లో తెలుగు గురించి తెలియని సుమారు 12 మంది వరకు తెలుగులో బ్లాగ్ లను ప్రారంభించడానికి నిర్ణయం తీసుకోవడమే !
Vol. No. 01 Pub. No. 149
11 comments:
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.
విజయవంతమైనందుకు శుభాకాంక్షలు.
చాలా సంతోషం. అభినందనలు.
అభినందనలు.
అభినందనలు.
అందరికీ అభినందనలు
* విజయ మోహన్ గారూ !
* వర్మ గారూ !
* కొత్తపాళీ గారూ !
* రవి గారూ !
* నాగ ప్రసాద్ గారూ !
* రవిచంద్ర గారూ !
అందరికీ కృతజ్ఞ్తతలు
నా అభినందనలు కూడా అందుకోండి. వచ్చేయేటికి స్టాలు పెట్టాలని కోరుకుంటూ..
చదువరి గారూ !
కృతజ్ఞతలు
మీ ప్రయత్నం సఫలమవ్వాలని ఆశిస్తున్నాను
నాగబ్రహ్మా రెడ్డి గారూ 1
కృతజ్ఞతలు
Post a Comment