
శాంతారాం 1950 ప్రాంతంలో ' అప్నా దేశ్ ' అనే పేరుతో హిందీలో ఒక చిత్రాన్ని నిర్మించారు. అదే చిత్రాన్ని తమిళంలో ' నమ్ నాడు ' పేరుతో నిర్మించారు. తెలుగులో కూడా నిర్మించాలనే ఉద్దేశ్యంతో కొన్ని పాటలు కూడా రికార్డు చేశారు. తర్వాత ఎందుకో తెలుగు చిత్ర నిర్మాణం విరమించుకున్నారు. అయితే ' అప్నా దేశ్ ' హిందీ చిత్రం ఆంధ్రలో విడుదలయినప్పుడు ఇక్కడి ప్రింట్లలో మాత్రం తెలుగు పాటల్ని ఉంచేశారు. ఆ పాటల్ని ఆ చిత్ర కథానాయిక పుష్ప హన్స్ మొదలైన వారితో బాటు మన తెలుగు గాయని టంగుటూరి సూర్యకుమారి కూడా పాడారు. ఆ చిత్రంలో సూర్యకుమారి పాడిన పాటను వినండి........
Vol. No. 01 Pub. No. 150
3 comments:
చాలా చక్కని విషయాలు చెప్పారు...పాట బావుంది.
మంచి సంగతి చెప్పారమ్డీ. నాకు చాలా ఇష్టమైన దర్శకుల్లో "శాంతారాం" ఒకరు. "దో ఆంఖే బారాహాథ్ " నాకు చాలా ఇష్టం.అందులో పాటలు కూడా సూపర్..
* ధరణిరాయ్ గారూ !
* తృష్ణ గారూ !
ధన్యవాదాలు
Post a Comment