
సున్నితమైన హాస్యానికి పెట్టింది పేరు మునిమాణిక్యం నరసింహారావు గారు. ఆయన కాంతం కథలు తెలియని తెలుగు పాఠకులుండరేమో !
అనుకోకుండా ఏదైనా తప్పిదం జరిగి, అది తన ప్రమేయం లేకుండా జరిగిపోయిందని నమ్మించడానికి కొన్ని అసందర్భ కారణాలను ఆసరాగా తీసుకుంటాం. అవి నిజం కాదని వినేవారికి తెలుసని మనకూ తెలుసు. అయినా మనల్ని సమర్థించుకోవడానికి అంతకంటే దారి కనబడక అసంబద్ధ కారణాలను చూపిస్తాం. ఈ విషయంలో పిల్లలు మనకాదర్శం. ఆటల్లో తగవులు, బడిలో మంచి మార్కులు తెచ్చుకోలేకపోవడం వగైరా సందర్భాల్ని సమర్థించుకోవడానికి వాళ్ళుపయోగించే కారణాలే పిల్ల సాకులు. వీటిని మునిమాణిక్యం గారు ఎలా వర్ణిస్తున్నారో చూడండి.
" మా ఆవిడ బల్ల మీద పెట్టిన మంచి నీళ్ళ గ్లాసు ఆదంతట అదే మొగ్గేసి బోర్ల పడుతుంది. పుస్తకాలన్నీ తడిసి పాడైపోతవి.
లాంతరు అదంతట అదే క్రింద పడుతుంది. నూనె అంతా వలకపోసుకుంటుంది.
పుస్తకంలోని పేజీ వాటంతట అవే చినిగి ముక్కలైపోతవి.
మరీ విచిత్రమైన విషయం ఏమిటీ అంటే మా ఆవిడ పులుసు రాచ్చిప్ప పొయ్యి మీద పెట్టి దొడ్లోకి వెళ్లి వచ్చేసరికి స్నానాల గదిలో డబ్బాలో వున్నా బొగ్గులు అవంతట అవే నడిచి వచ్చి పులుసు రాచ్చిప్పలో పడతాయి "
ఇలా సాగుతాయి మునిమాణిక్యం గారి పిల్ల సాకులు......
Vol. No. 01 Pub. No. 151
4 comments:
మీరు వ్రాస్తున్న విశేషాలు బాగున్నాయి. మునిమాణీక్యం గారి పుస్తకాలు పున:ముధ్రణ అయ్యి ఇప్పుడు ఏమన్న దొరుకుతున్నాయా చెప్పగలరు.
baagunnaayi saar.
@ మంచి రచయితని మరోమారు గుర్తు చేయడం బాగుందండీ. ఇంకా ఎక్కువ విశేషాలు రాసివుంటే బాగుండు అనిపిస్తోంది. ఏమయినా ఇలా గతకాలపు రచయితలు గతించిపోలేదని మనం గుర్తు చేసుకోవాల్సిన అవుసరం చాలా వుంది.
శివ గారూ !
ధన్యవాదాలు. పునర్ముద్రణ గురించి విచారించి తెలియజేస్తాను.
వర్మ గారూ !
ధన్యవాదాలు
తెలుగు తూలిక గారూ !
ధన్యవాదాలు. మునిమాణిక్యం గారి గురించి గతంలో కొన్ని విశేషాలు
http://www.teluguonline.net/view_asia.php?cat=19&content=108 ఇచ్చాను. గమనించగలరు.
Post a Comment