Sunday, May 22, 2011

ఆ కలం ఆగి ఏడాదయింది

ఆ కలం ఆగి ఏడాదయింది
ఆ సాహిత్యం దూరమై ఒక ఏడు గడిచింది

తెలుగు జాతి సరస్వతి సాహితీ నాదం ఆగిపోయింది
తెలుగు సినిమా సాహిత్య వైభవం మసకబారిపోయింది 

అంతులేని సాహిత్య పద సంపద వేటూరి
అంతములేని సాహితీ రతనాల గని వేటూరి 

మనకి దూరమై ఏడాది గడిచింది 
మనసు భారమై ఏడాది వగచింది

ఆ పాటకు మరణం లేదు అది సజీవం 
ఆ మాటకు తిరుగులేదు అది సత్యం

తెలుగు సాహిత్యమున్నంతవరకూ వేటూరి పాట వుంటుంది 
తెలుగు భాష ఉన్నంతవరకూ వేటూరి సాహిత్యం వుంటుంది

ప్రతి తెలుగు గుండెలో వేటూరి వున్నారు 
ప్రతి తెలుగు మదిలో వేటూరి నిండిపోయారు

ఆయన మనకు దగ్గరి దూరమయ్యారు 
ఆయన మనకు దూరమై దగ్గరయ్యారు 

 పుంభావ సరస్వతి వేటూరి సుందరరామ మూర్తి గారి ప్రథమ వర్థంతి సందర్భంగా వారికివే సాహితీ నీరాజనాలు 

 వేటూరి గారి గురించి గతంలో రాసిన టపాలు.......

తెలుగు పాటకు చిరునామా వేటూరి

రాలిపోయిన పువ్వు

సాహితీమూర్తి విశేషాలు

 కవి అంటే........

Vol. No. 02 Pub. No. 237

8 comments:

తృష్ణ said...

అప్పుడే ఏడాదయ్యిందా అనిపిస్తోందండీ..!

శిశిర said...

అప్పుడే ఏడాదయ్యిందా! తెలియనేలేదండి.

SRRao said...

ధన్యవాదాలు తృష్ణగారూ ! శిశిర గారూ !

astrojoyd said...

వాటు,నాటు,పోటు,ప్రేమ​,తత్వ,సోక లేఖరి పరమపదించి అపుడే ఏడాది నిండినది.వారి ఆత్మ సదా కైలాసాన కార్తీకంలో వెలిగే హిమ,శివ రూపమై అఖండంగా జ్వలిస్త్త్హునే ఉండాలని కోరుకుంటున్నాను.మాటల​ను వేటుగా ఉపయోగించే సుందర పద రామ మూర్తి మహాశయా ఇవే మా మాటల అభివందనాల హరిచందనాలు

Dr.Suryanarayana Vulimiri said...

రావుగారు, నమ్మశక్యం కావడంలేదు ఏడాది అయిందంటే. ఇంకా మన మధ్య ఆయన వున్నట్లే వుంది. అయినా నా పొరపాటు గాని, ఆయన మనను వీడి ఎక్కడకెళతారు. తెలుగు ప్రజల గుండెల్లో నిత్య ఆమనిలా, పున్నాగ పూల సన్నాయి వినిపిస్తూ, "గోపాలా మసజసతతగ శార్దూలా"-ఇది మీ తెలుగు వరువకండి, అని మనకు గుర్తు చేస్తూ మనమధ్యనే వున్నారు. ఇది నిజం. వారిని మరల అందరికి గుర్తుచేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు.

Vinay Datta said...

అప్పుడే ఏడాదయిందా...!

madhuri.

రాజేష్ జి said...

అవును అప్పుడే... ఏడాది అయ్యి౦దా.! ఏదో తెలీని బాధ. ఇక్కడ కనీసం సొంతఇల్లుకి కూడా నోచుకోని వారు ఆ పైలోకంలో తన తల్లి సరస్వతమ్మ ఇల్లు తనదిగా సుఖసంతోషాలు అనుభవిస్తుటారని భావిస్తూ..!

"
ఆయన మనకు దగ్గరి దూరమయ్యారు
ఆయన మనకు దూరమై దగ్గరయ్యారు

"
నిజమే!

SRRao said...

* astrojoyd గారూ
* సూర్యనారాయణ గారూ !
* మాధురి గారూ!
* రాజేష్ గారూ !

ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం