పగిలే ఆకాశం నీవై
జారిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై
తీగ తెగే వీణియవై
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే.....
తెలుగు పాటను దశదిశలా వినిపించిన కవితాకుసుమం
తెలుగు పాటకు సాహిత్య పరిమళాలు అద్దిన సాహితీ మూర్తి

తెలుగు చిత్రగీతాకాశంలో ఆలాపనగా మిగిలిపోయిన వేటూరి
ఆ పువ్వు రాలిపోయింది - ఆ కలం ఆగిపోయింది
ఆ గీతం మూగవోయింది - ఆ సాహితీవనం బోసిపోయింది
ఇవేవీ నిజం కావు
వేటూరీ మీకు మరణం లేదు
మీ పాటలో మీరు ఎప్పటికీ సజీవులు
తెలుగువారి గుండెల్లో మీపాటలు చెరిగిపోని ముద్రలు
Vol. No. 01 Pub. No. 294
7 comments:
vaariki ide manandari shraddhanjali
సాహితీ మూర్తికి శ్రద్ధాంజలి.
'వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి" అని తన ఇష్టాన్ని చెప్పుకున్న ఆ మహాకవి అన్నట్లే చేసారు. మనందరిని తన పాటల లోకం నుంచి తరిమేసారు. కృష్ణశాస్త్రి తరువాత నేనెంతో ఇష్టపడ్డ ఈ మహాకవి నిష్కృమణం చాలా బాధకలిగిస్తోంది.
its a great loss to the telugu film industry....may his soul rest in peace..
* మాడీ గారూ !
* విజయ్ మోహన్ గారూ !
* జయ గారూ !
* తృష్ణ గారూ !
మీ అందరి శ్రద్దాంజలులు ఆ మహానుభావుడికి చేరాలని కోరుకుంటూ..... నమస్సులు.
వేటూరి 70 % చెత్త పాటలు 30 % మంచి పాటలు వ్రాశాడని నా అభిప్రాయం. తెలుగు సినిమాల్లో తప్పదంతే. గీతాంజలి సినిమాలో ఓంనమ: అనేపాటలో ’సూరీడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళలో’ అన్న మాటలు నాకు అమితంగా నచ్చాయి.
* తెలుగు అభిమాని గారూ !
వేటూరిగారు రాసిన పాటల్లో వ్యాపారధోరణి పాటలున్నాయేమోగానీ మీరు చెప్పిన స్థాయిలో చెత్త పాటలు మాత్రం లేవు. నిన్న సుద్దాల అశోక్ తేజ గారు చెప్పినట్లు ' ఆరేసుకోబోయి పారేసుకున్నాను' లాంటి పాటలు కూడా మంచి ఛందస్సులోనే ఉంటాయి.
ఇక తెలుగు సినిమాల్లో తప్పదని అనుకోవడానికి అప్పట్లో రాజుల్ని మెప్పించడానికి కవులు రాస్తే ఇప్పుడు సామాన్య ప్రజల/ ప్రేక్షకులకోసం అనే నిర్మాతల్ని, దర్శకులని మెప్పించడానికి రాయాలి. వేటూరి తెలుగు చిత్ర పరిశ్రమ అదృష్టం. ఆయన లేకపోవడం చిత్ర పరిశ్రమ దురదృష్టం.
గంగగోవు పాలు గరిటడైన చాలు అన్నట్లు ఆయన రాసిన అద్భుతమైన పాటలే మనందరి హృదయాలలోనూ శాశ్వతంగా నిలిచేవి.
Post a Comment