Saturday, January 9, 2010

శ్రీశ్రీ శ్రవ్య నాటికలు

రంగస్థలం మీద ప్రదర్శించే దృశ్య ప్రధానమైన నాటికలకు భిన్నమైనవి శ్రవ్య నాటికలు. దృశ్య నాటికలు గానీ, నాటకాలు గానీ సంభాషణలకంటే నటుడి / నటి హావభావాల ద్వారా రచయిత / ప్రయోక్త చెప్పదలచుకున్న సందేశాన్ని ప్రేక్షకులకు అందిస్తాయి. కానీ శ్రవ్య నాటిక / నాటకానికి ఆ సౌలభ్యం లేదు. అక్కడ దృశ్యం ఉండదు. ప్రేక్షకులుండరు. కేవలం శ్రోతలు మాత్రమే ఉంటారు. రచయిత సంభాషణలలోనే దృశ్యాన్ని అందించగలగాలి. నటీనటులు తమ హావభావాలను సంభాషణలలోను, చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ ద్వారాను వ్యక్తం చెయ్యగలగాలి. అందుకే శ్రవ్య నాటిక రచన దృశ్య నాటిక రచన కంటే కష్టమైనది.

1980 దశకం వరకూ సామాన్యుడికి అందుబాటులో వున్న ఏకైక ప్రధాన ప్రసార మాధ్యమం ' రేడియో ' అదే 'ఆకాశవాణి '. మన దేశంలో స్వాతంత్ర్యానికి పూర్వమే ప్రాచుర్యంలోకి వచ్చిన రేడియో తర్వాత సామాన్య జనం జీవితాలలో విడదీయరాని భాగమైపోయింది. అప్పట్లో నాటకాలంటే దసరా, వినాయక చవితి మొదలైన ఉత్సవాల సమయంలోనో, అరుదుగా ఇతర సమయాలలోను ప్రదర్శించేవే ! రేడియో ప్రాచుర్యంలోకి వచ్చాక శ్రవ్య నాటక యుగం ప్రారంభమైంది. ప్రసిద్ధ నటుల రంగస్థల నాటకాలు గ్రామఫోన్ రికార్డులుగా వచ్చినా అప్పట్లో గ్రామఫోను కూడా లగ్జరీనే కావడం వలన అవి శ్రవ్య రూపంలో కన్న దృశ్య రూపంలోనే ఎక్కువ ఆదరణ పొందాయి. రేడియో శ్రవ్య నాటకాలను ప్రోత్సహించింది. ఎన్నో మంచి నాటకాలు వచ్చాయి. మరెన్నో మంచి నాటకాలు, కథలు, నవలలు శ్రవ్య నాటికలు, నాటకాలుగా రూపాంతరం చెందాయి. ప్రత్యేకంగా శ్రవ్య నాటకాలను రచించే రచయితలతో బాటు కొందరు ప్రసిద్ధ కవులు, రచయితలు అనేక రూపాల్లో శ్రవ్య నాటక రచన సాగించారు.

వారిలో మహాకవి శ్రీశ్రీ కూడా ఒకరు. ఆయన రేడియో కోసం రచించిన నాటికలు అప్పట్లో ప్రయోగాత్మకమైనవనే చెప్పాలి. వాటిల్లో కూడా ఆయన సామాన్య జనం తరఫునే నిలిచారు. వాటిల్లో కూడా ఆయనకే ప్రత్యేకమైన శైలి కనబడుతుంది. 1962 వరకూ రేడియోలో ( ఎక్కువగా మద్రాసు ఆకాశవాణి కేంద్రం నుండి ) ప్రసారమైన శ్రీశ్రీ నాటికల్ని' 1+1 = 1 మొదలైన రేడియో నాటికలు' అనే పేరుతో సంకలీకరించారు. ఆ నాటికలలో ఒకటి ఇంతకు ముందు టపాలో పరిచయం చేసిన ' గుమాస్తా కల ' . శ్రీశ్రీ రచనలు ' మహాప్రస్థానం ' 'సిరిసిరి మువ్వ ' ' ఖడ్గసృష్టి ' లాంటి కవితా ఖండికలు గుర్తున్నంతగా ఆయన నాటికలు గుర్తుండవు. మరోసారి ఆ మహాకవి రచించిన నాటికల్ని గుర్తు చేసే చిన్ని ప్రయత్నం ఈ పరిచయం.

Vol. No. 01 Pub. No. 154

8 comments:

జయ said...

శ్రీ శ్రీ నాటికల గురించి బాగా చెప్పారండి. ఏవైనా అందుబాటులో ఉంటేనే కదా తెలిసేది. ఇలాగే అన్నీ మీరే పరిచయం చేయాలి.

SRRao said...

జయ గారూ !
ధన్యవాదాలు.

Anonymous said...

interesting!

SRRao said...

అశ్వినిశ్రీ గారూ !
ధన్యవాదాలు

శివరామప్రసాదు కప్పగంతు said...

రావు గారూ,

మీరు ఉండేది విజయవాడలోనే కాబట్టి, ఆకాశవాణి వారిని సంప్రదించి మీరు వ్రాసిన నాటికలే కాదు, ఇంకా ఎన్నెన్నో అపురూపమైన రికార్డింగులు వారి వద్ద ఉన్నవి ప్రజలకు అందించే ప్రయత్నం చెయ్యమని రేడియో అభిమానులందరి తరఫునా తెలియచేయగలరు. వారికి ప్రస్తుతం పనిచేస్తున్న ఈ మెయిలు తెలియచేస్తే, మన బ్లాగులో ఒక ప్రకటన ఇవ్వచ్చు అభిమానులందరూ వారికి తమ కోరిక మైళ్ళ ద్వారా తెలుపమని.

ఒక్క ఈ ప్రయత్నం చెయ్యరూ.

SRRao said...

శివ గారూ !
ఆలస్యమైంది. మన్నించండి. ముందుగా నేనేమీ నాటికలు గట్రా రేడియోకు రాయలేదండీ ! ఇక మా గురువు గారి పాటల రికార్డింగుల కోసం గతంలో ప్రయత్నించాను. సానుకూలపడలేదు. ఇప్పుడు మీ ప్రతిపాదన బాగుంది. నాకు తెలిసిన వారొకరిద్దరు ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు కూడా వున్నారు. వారి ద్వారా తప్పక ప్రయత్నిస్తాను.

shri said...

అద్భుతమైన ఊహ,అసమాన కల్పన!
ఇంతకీ కోనేటి రావులూ,కోనేటి రాణులూ కానివారెవరు!

శ్రీదేవి

SRRao said...

ధన్యవాదాలు శ్రీదేవి గారూ !

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం