అమర గాయకుడు
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు
గానం చేసిన ఈ దేశభక్తి గీతం మీకోసం..........
స్వాతంత్ర్యమే మా జన్మ హక్కనీ చాటండీ !
స్వాతంత్ర్యమే మా జన్మ హక్కనీ చాటండీ !
నిరంకుశమగు శక్తులెదిరినా నిర్భయమ్ముగా నిదురించండీ !!
నిరంకుశమగు శక్తులెదిరినా నిర్భయమ్ముగా నిదురించండీ !!
పరుల దాస్యమున బాధలు పొంది బ్రతికిన చచ్చిన బేధమే లేదు
పరుల దాస్యమున బాధలు పొంది బ్రతికిన చచ్చిన బేధమే లేదు
[[ స్వాతంత్ర్యమే ]]
కవోష్ణ రుధిర జ్వాలలతోటి .............
కవోష్ణ రుధిర జ్వాలలతోటి స్వతంత్ర్య సమరం నడపండీ !
కవోష్ణ రుధిర జ్వాలలతోటి స్వతంత్ర్య సమరం నడపండీ !
ఎంతకాలమిటు సహించి వున్నా దోపిడీ మూకకు దయరాదన్నా
ఎంతకాలమిటు సహించి వున్నా దోపిడీ మూకకు దయరాదన్నా
[[ స్వాతంత్ర్యమే ]]
సంఘములోని ఐక్యత వేగమే సంఘటపరుపుము శాంతి పథాన .............
సంఘములోని ఐక్యత వేగమే సంఘటపరుపుము శాంతి పథాన
స్వర్గతుల్యమౌ స్వతంత్ర్య జ్యోతికి మాంగల్యపు హారతులిమ్మా ... మాంగల్యపు హారతులిమ్మా !!
[[ స్వాతంత్ర్యమే ]]
Vol. No. 01 Pub. No. 368
4 comments:
అమర గాయకుడి గొంతులో నుండి జాలివారిన ఈ పాట వింటే,ఆగస్టు 15 ఒక వారం ముందరే వచ్చిందనిపించింది.Thanks for the Audio link and Lyrics.
ఎప్పుడో పాడుతా తీయగా కార్యక్రమంలో ఓ పార్టిసిపెంట్ పాడగా విన్నాను. అప్పటి నుంచీ ఈ పాటంటే చాలా ఇష్టం. ఇన్నాళ్ళకు ఇలా చూస్తున్నందుకు ఆనందంగా ఉంది.
ఒక చిన్న మాట.
సవోష్ణ అని కాక కవోష్ణ అని ధ్వనిస్తున్నట్లుంది. ఒకసారి పరిశీలించగలరు.
nice song
thank you!
* హరేకృష్ణ గారూ !
* రిషి గారూ !
ధన్యవాదాలు
* రవిచంద్ర గారూ !
ధన్యవాదాలు, పొరబాటును తెలిపినందుకు. సరిజేసాను.
Post a Comment