ఆ మహాత్ముని అంతిమ యాత్ర దృశ్యాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రీకరణలో ప్రజలందరూ విరివిగా పాల్గొనవలసినదిగా విజ్ఞప్తి చేస్తూ రేడియోల్లోనూ, టీవీల్లోనూ, పత్రికలలోనూ, ఇంకా చాలా విధాలుగా ప్రకటించారు .
కానీ ఎంత ప్రయత్నించినా పదిహేనువేలమంది దాటలేదు. వాళ్ళలో కూడా చాలామంది ఆధునిక దుస్తులు ధరించి వచ్చారు. ఆ కాలానికి తగ్గట్లు వాళ్ళ ఆహార్యం మార్చడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అయినా అటెన్ బరో కి తృప్తి కలుగలేదు.
మిలిటరీ దళాలనుంచి సుమారు 1700 మందిని, BSF జవానుల్ని, డిల్లీ పోలీసుల్ని కూడా రప్పించినా ఆయనకు ఇంకా తృప్తి కలుగలేదు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు.
చివరికి అటెన్ బరో కూడా తనే వేషం వేసుకుని ఆ జనాల్లో ఒకడుగా నిలబడ్డాక తృప్తి కలిగింది. అంతిమయాత్ర సీను అద్భుతంగా వచ్చింది.
1938 లో వచ్చిన ' మాలపిల్ల ' చిత్రంలో పి. సూరిబాబు పాడిన బసవరాజు అప్పారావు గారి గీతం ' కొల్లాయి గట్టితేనేమి....' బి. నరసింహారావు గారి స్వరకల్పనలో ..................
Vol. No. 01 Pub. No. 372
2 comments:
రావు గారు, మాలపిల్ల సినిమా దొరుకుతోందాండి?
విజయవర్ధన్ గారూ !
నాకు తెలిసినంతవరకూ మాలపిల్ల ప్రింట్ NFAI ( national film archives of India ) వారి దగ్గర మాత్రమే వుంది. ఒకసారి మా ఫిలిం సొసైటీ లో వారి దగ్గరనుంచి తెచ్చుకుని ప్రదర్శించాం. వాళ్ళు సాధారణంగా బయిటకు ఇవ్వరు. గతంలో దూరదర్శన్ లో ప్రదర్శించినట్లు గుర్తు. బయిట దొరకడం కష్టమే !
Post a Comment