Thursday, August 26, 2010

బొచ్చుకుక్కా ? ఒట్టి కుక్కా ?

 అధికారానికి సృజనాత్మకతకు సరిపడదేమో !
లలిత కళలు, వాటికి సంబంధించిన విభాగాలు ప్రభుత్వాధీనంలో వుంటే వాటి పరిస్థితి ఏమిటో వేరేగా చెప్పనక్కరలేదు. అధికారం, అలసత్వం, అవినీతి, బంధుప్రీతి వగైరా అవలక్షణాలన్నీ చెరుకుకు పట్టిన చెదల్లా లలిత కళల్లో వున్న తీపిని పీల్చేసి మనకి పిప్పిని మిగులుస్తాయి. గతంలో ప్రభుత్వ అకాడెమిలు, వాటి పనితీరు తెలిసిన వాళ్ళందరికీ ఇది అనుభవమే ! అలాగే ప్రభుత్వ సంస్థలైన ఆకాశవాణి, దూరదర్శన్ విషయం చెప్పనక్కర్లేదు. అందరూ ఇదే పద్ధతిలో ఉంటారని చెప్పలేం గానీ ఆ విభాగాల అధికారులలో  చాలామంది తమ అలసత్వానికి, అవినీతికి ప్రభుత్వ నియమనిబంధనలను అడ్డు పెట్టుకుంటారు. కొంతమందికి సృజనాత్మకత లేకపోయినా ఇతర కారణాలవలన ఆ స్థానానికి చేరుకుని యాంత్రికంగా విధులు నిర్వహిస్తుంటారు. కానీ ఈ విభాగాల్లో సృజనాత్మకత తప్ప యాంత్రికత పనికిరాదు.

అలాంటి యాంత్రికత, నియమ నిబంధనలు సృజనాత్మకతకు ఎలా అడ్డు వస్తాయి అనేదానికి ఒక ఉదాహరణ.......


ప్రముఖ రచయిత దేవరకొండ బాలగంగాధర తిలక్ ఒకసారి ఆకాశవాణికి ఒక కవిత పంపించారు. అందులో ఒక పంక్తిలో ' ఒడిలో బొచ్చుకుక్క పిల్ల ' అంటూ రాసారట. ఆ కవితలో  ' బొచ్చు ' అనే పదం ఆ రేడియో కేంద్ర అధికారులకు అభ్యంతరకరంగా తోచింది. అందుకని ఆ మాట తీసేయ్యమన్నారట. తిలక్ గారికి అందులో అభ్యంతరమేమిటో అర్థం కాలేదు.
" బొచ్చు కుక్క పిల్లను బొచ్చు కుక్క పిల్ల అనక ఒట్టి కుక్కపిల్ల అంటారా ?  "
అని చిరాకు పడ్డారట.


Vol. No. 02 Pub. No. 013

3 comments:

సుజాత వేల్పూరి said...

అవునండి,మామూలు మనుషులకు అర్థం కాని నిబంధనలు ఆలిండియా రేడియో,దూరదర్శన్ ల వద్ద చాలా కనపడతాయి.యర్రంశెట్టి శాయి రాసిన ఒక సెటైర్లో అలాగే ఉంటుంది."నాకిద్దరూ ఆడపిల్లలే" అని ఒక తండ్రి చెప్తే ప్రోగ్రామ్ "స్త్రీలకు ఈ వాక్యం అవమానం" అని ఆ వాక్యాన్ని తీసేస్తారు.

సృజనాత్మకత లేని వ్యక్తులకు సృజనాత్మకత ఉండాల్సిన చోట ఉద్యోగాలొస్తే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి.

Vinay Datta said...

I heard this trend in AIR & Doordarshan has started after they started recruiting personnel through exams, leaving aside talent in a particular field.

SRRao said...

* సుజాత గారూ !
* మాధురి గారూ !

ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం