Friday, August 6, 2010

మాదీ స్వతంత్ర్య దేశం


 తెలుగు జాతి గర్వించదగ్గ గాయని టంగుటూరి సూర్యకుమారి గారు 
ఆలపించిన ఈ దేశభక్తి గీతం వినండి.




మాదీ స్వతంత్ర్య దేశం
మాదీ స్వతంత్ర్య జాతి                [[ మాదీ ]]

భరత దేశమే మా దేశం
భారతీయులం మా ప్రజలం
భరత దేశమే మా దేశం
భారతీయులం మా ప్రజలం         [[ మాదీ ]]

వింధ్య హిమవర్తీ నీలాద్రుల సంధ్యారుణి తన భాషలు మావి
వింధ్య హిమవర్తీ నీలాద్రుల సంధ్యారుణి తన భాషలు మావి

గంగా గోదావరి సహ్యజాత్తుంగ తరంగితాద్విషయాలు మావి
గంగా గోదావరి సహ్యజాత్తుంగ తరంగితాద్విషయాలు మావి         [[ మాదీ ]]

ఆలయమ్ముల శిల్ప విలాసం ఆరామమ్ముల కళా ప్రకాశం
ఆలయమ్ముల శిల్ప విలాసం ఆరామమ్ముల కళా ప్రకాశం

మొఘల్ సమాధుల రసకర హాసం
మాకు నిత్య నూతనేతిహాసం                                               [[ మాదీ ]]  


అహింసా పరమోధర్మ :  సత్యంవద ధర్మంచర
అహింసా పరమోధర్మ :  సత్యంవద ధర్మంచర

ఆ ద్విజుషుల వేద వాక్కులు
మా గాంధి గౌతముల సువాక్కులు   
ఆ ద్విజుషుల వేద వాక్కులు
మా గాంధి గౌతముల సువాక్కులు                                       [[ మాదీ ]]                                                                             

స్వతంత్ర్యతా భాత్రుత్వాలు  సమతా మా సదాశయాలు
జననీ ఓ స్వతంత్ర్య దేవీ కొనుమా నివ్వాళులు నావి   
జననీ ఓ స్వతంత్ర్య దేవీ కొనుమా నివ్వాళులు నావి                  [[ మాదీ ]]




Vol. No. 01 Pub. No. 366

7 comments:

భావన said...

ఎప్పుడో చిన్నప్పుడు విన్నా ఈ పాట నేను. బాగుందండి. ఆమె గొంతులో ఇంకా బాగుంది.అందించినందుకు ధన్యవాదాలు.

Saahitya Abhimaani said...

Thank you Raoji for giving an opportunity to hear a good old song. Like this, if you can give us opportunity to hear

KONDA MEEDA KoYILA OKATI KOOSIMDI

It was used to be sung in the Children's programme in AIR, Vijayawada when Shri Adida Kameswara Rao was Radio Annayya.

SRRao said...

* భావన గారూ !
ధన్యవాదాలు

* శివ గారూ !
ధన్యవాదాలు. మీరడిగిన పాట నా దగ్గర లేదండీ ! విచారించతగ్గ విషయమేమిటంటే ఆయన కుటుంబ సభ్యులెవరి దగ్గరా ఆయన జ్ఞాపకలేమీ లేవు. అయినా ప్రయత్నిస్తాను.

Saahitya Abhimaani said...

Raoji, you are in an excellent area, the Capital of Arts-Vijayawada. You have AIR., Vijayawada. Please do contact somebody you know there who I am sure shall help you to get it from their Archives.

That song was so popular, if you can feature it in your blog, it will make hundreds and hundreds of people VERY HAPPY.

Please try Sir.

SRRao said...

శివ గారూ !
మీరు చెప్పింది నిజమే ! కానీ AIR ప్రసారభారతి అనుబంధంగా మారాక archives నుంచి ఏవీ బయిటకు రావడం లేదు. వాళ్ళే వాటిని cd లుగా మార్చి వ్యాపారం చేస్తున్నారు. కామేశ్వరరావుగారి వారసులు ద్వారా ఆ ప్రయత్నం మూడేళ్ళ క్రితమే చేసాం. వారి మనుమలు నాకు మంచి స్నేహితులు. అలాగే నిన్న టపాలో ఉంచిన ' ఆంధ్ర పుణ్యక్షేత్రాలు ' రచయిత వక్కలంక లక్ష్మీపతిరావు గారి పాటలెన్నో, ప్రముఖ గాయకులు పాడినవి,ఆకాశవాణి లో వున్నాయి. వాటికోసం గత మూడు, నాలుగు సంవత్సరాలుగా చాలారకాలుగా ప్రయత్నిస్తున్నాం. ఆయనే స్వయంగా అడిగినా ఇవ్వలేదు. ఇవ్వనని అనరు. అక్కడ గతంలోలాగ లేదు పరిస్థితి. అందుకే ప్రయత్నిస్తాను అని అన్నాను. నా ప్రయత్నం మాత్రం మానను. దొరికితే అవకాశాన్ని బట్టి తప్పక అందరికీ అందుబాటులోకి తెస్తాను.

కమనీయం said...

దయచేసి నా వ్యాససంపుటి ''వెన్నెలవెలుగులు ''లో(2010)టంగుటూరిసూర్యకుమారి-జాతీయగీతాలు అనే వ్యాసం చదవండి.ఆవిడ పాటల కాసెట్ ఒకటి నా దగ్గర ఉన్నది. రమణారావు.ముద్దు

SRRao said...

రమణారావు గారూ !

ధన్యవాదాలు. మీ వెన్నెలవెలుగులు ప్రాప్తిస్థానం తెలియజేస్తే కృతజ్ఞుడిని.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం