జవాబులు
ముందుగా ఈ ప్రశ్నలకు సమాధానం వెంటనే చెప్పిన జ్యోతి గారికి ధన్యవాదాలు. ఆవిడ మొదటి ప్రశ్నకు అన్నీ సరిగానే చెప్పారు గానీ శారద పేర్లలో ఒక పేరు మర్చిపోయారు. ఆ వివరాలు........
జవాబు : తులాభారం - మలయాళం ( 1968 ) , స్వయంవరం - మలయాళం ( 1972 ), నిమజ్జనం - తెలుగు ( 1979 )
2 . శారద ఆ పేరుతోనే కాక ఇంకా కొన్ని పేర్లతో నటించింది. అవి ఏమిటో చెప్పగలరా ?
జవాబు : శారద అసలు పేరు సరస్వతి. చిత్రసీమలోకి రాకముందు నాటకాల్లో నటించేటప్పుడు ఆ పేరే ఉపయోగించేవారు. నాగభూషణం ' రక్తకన్నీరు ' నాటకంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
చిత్రసీమలోకి ప్రవేశించాక శారద గా పేరు మార్చుకున్నారు.
తర్వాత మళయాళ చిత్రరంగంలోకి వెళ్ళాక మొదటి చిత్రంలో ' రాహెల్ ' అనే పేరుతో నటించారు. తర్వాత చిత్రం నుంచి శారద గానే కొనసాగేరు.
Vol. No. 02 Pub. No. 010a
No comments:
Post a Comment