Wednesday, August 4, 2010

స్వరాజ్య స్పూర్తి


 స్వాతంత్ర్యోద్యమ కాలంలో దేశంలో ప్రతి ఒక్కరిలోనూ ఆ స్పూర్తి ప్రతిఫలించేది. ఆ ప్రభావం స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత కొంత కాలం వరకూ కొనసాగింది. చిత్ర పరిశ్రమ కూడా దీనికి అతీతం కాదు. స్వాతంత్ర్యానంతరం 1949 లో ఎన్టీ రామారావు గారి తొలి చిత్రం గా వచ్చిన " మనదేశం " చిత్రం విషయంలో జరిగిన ఓ సంఘటన దీనికి తార్కాణం.


ఆ చిత్రంలో ఓ దేశభక్తి గీతం రికార్డింగ్ జరుగుతోంది. పాట పాడుతున్నది, పాడిస్తున్నది గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. అప్పటికే చాలాసార్లు పాడారు. బాగా వస్తున్నట్లు అనిపించడం లేదు. ఘంటసాల గారికి తృప్తి కలగడం లేదు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. దీన్ని గురించే తీవ్రంగా ఆలోచిస్తూ చుట్టూ చూసారు ఘంటసాల. దూరంగా ఓ పెద్ద మనిషి గాంధీ టోపీ పెట్టుకుని ఎవరితోనో మాట్లాడడం కనబడింది. వెంటనే ఘంటసాల గారు అక్కడి సిబ్బందిని వుద్ద్యేశించి " కాసేపు ఆ టోపీ కావాలి. ఎవరైనా వెళ్లి ఆ పెద్దమనిషిని అడిగి తీసుకొచ్చి పుణ్యం కట్టుకుంటారా ? " అన్నారు. వారిలో ఒకరు వెళ్లి ఆ టోపీ తీసుకొచ్చారు. ఆది తలకి పెట్టుకుని రికార్డింగ్ స్టూడియోలోకి వెళ్ళారు ఘంటసాల గారు. అంతే ! పాట బ్రహ్మండంగా వచ్చింది. స్వరాజ్య స్పూర్తి ఎంత గొప్పదో, అప్పటి తరంలో అణువణువునా ఎలా జీర్ణించుకుపోయిందో నిరూపించిన ఈ సంఘటనకు కారణమైన పాట.......
భారత యువకా కదలిరా........... వినండి



Vol. No. 01 Pub. No. 363

3 comments:

తార said...

ఆణిముత్యాలు ఏరి, కూర్చి మాకు వడ్డిస్తున్నారు..

కృతజ్ఞతలు..

కొత్త పాళీ said...

రావుగారూ, పాత సినిమా, సంగీతాలకి సంబంధించినంతవరకూ మీరు ఈ బ్లాగ్లోకంలో ఒక నిధి! నెనర్లు.

SRRao said...

* తార గారూ !
ధన్యవాదాలు

* కొత్తపాళీ గారూ !
మీ అభిమానానికి కృతజ్ఞతలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం