పరతంత్ర పాలనలో మగ్గిన భారతజాతి స్వాతంత్ర్య వాయువులు పీల్చుకుని 63 సంవత్సరాలు గడిచిపోయాయి.
ఎన్నెన్నో పంథాలు, పోరాటాలు, విధానాలు, ఉద్యమాలు, త్యాగాలు, బలిదానాలు.......
వెరసి పరాయి పాలకుల పలాయనం, స్వతంత్ర్య బారతదేశ ఆవిర్భావం
స్వాతంత్ర్యోద్యమం కేవలం పరాయిపాలనకు వ్యతిరేకంగా జరిగింది కాదు
మన హక్కులు, మన సంపద, మన సంస్కృతి కాపాడుకోవడానికి జరిగిన ఆత్మగౌరవ పోరాటం
రాజ్యంలోని మానవులందర్నీ సమానంగా చూడలేని రాజు... రాజు కాడు
సమాజంలోని తోటి మనుష్యుల్ని తమతో సమానంగా చూడలేని ప్రజలు... ప్రజలు కారు
రాజరికంలో యథా రాజా తథా ప్రజా
ప్రజాస్వామ్యంలో యథా ప్రజా తథా రాజా
ఇది స్వాతంత్ర్యోద్యమ స్పూర్తి మనకు నేర్పించింది
ఇవే హక్కుల్ని రాజ్యాంగం మనకు ప్రసాదించింది
మన హక్కుల్ని మనమెంతవరకూ కాపాడుకుంటున్నాం ?
మన అధికారాల్ని మనమెంతవరకూ ఉపయోగించుకుంటున్నాం ?
ప్రజాస్వామ్యంలో పాలకులు ఉండరు...సేవకులే అందరూ ....
మరి సేవకుల్ని పాలకులుగా ఎందుకు భావిస్తున్నాం ?
బ్రిటిష్ వలస పాలనలో 200 ఏళ్ళు మగ్గిన మనలో ఆ బానిస భావాలు పోలేదా ?
ఇంకా ఎన్ని తరాలు ఆ భావ దారిద్యంలో మగ్గాలి ? దానినుండి ఈ జాతికి విముక్తి లేదా ?
నవ భావాల ... ఆధునిక యువతరమైనా ఈ బానిస భావాలను చేదిస్తుందా ?
డబ్బు సంపాదనా మార్గాల అన్వేషణలో పడి కర్తవ్యం మరచిపోతుందా ?
వ్యక్తి కంటే సమాజం ముఖ్యమని నవతరం గుర్తిస్తే నిజమైన స్వాతంత్ర్య ఫలాలను చూడవచ్చు
సమాజం బాగుంటేనే మనం హాయిగా, స్వేచ్చగా జీవించగలమని యువత గుర్తించాలి
నా కుటుంబం, నా బాగు, నా సంపాదన, నా సరదాలు అనే పరిధిని దాటి ఆలోచించాలి
అప్పుడే స్వాతంత్ర్య యోధుల త్యాగాలకు నిజమైన విలువ నిచ్చినట్లవుతుంది
అప్పుడే సమసమాజ, నవసమాజ స్థాపన సాధ్యమవుతుంది
విభజించి పాలించు సూత్రాన్ని పాటిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం అప్పటివరకూ ఒకే జాతిగా వున్న భారతీయుల్ని రెండుగా విడదీసింది . 63 ఏళ్ళు గడిచినా ఆ బేధాలు సమసిపోలేదు. సరిగదా మన నాయకులు ఈ బ్రిటిష్ సూత్రాన్ని బాగా వంటపట్టించుకుని తమ పబ్బం గడుపుకుంటున్నారు. ఇప్పటికైనా నవతరం మేల్కొని ఇలాంటి కుత్సిత, స్వార్థపూరిత నాయకులకు మంగళం పాడకపోతే మన జాతిలో మరో ముసలం పుడుతుంది.
64 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో ....................
స్వాతంత్ర్యం సిద్ధించిన పరిణామ క్రమం చూడండి..............
Vol. No. 02 Pub. No. 001
12 comments:
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
wow , great line
Happy Independence Day
దేవుడు, దేశం, ప్రజలు...ఒకటి కావా అన్న వాక్యం మీరు చూపిన వీడియోలో వినపడింది.ఇందులో ఒక గూఢం కనిపిస్తుంది.
శ్లో: రాజా సత్యం చ ధర్మంచ రాజా కులవతాం కులం
రాజా మాతా పితా చైవ రాజా హితకరో నృణాం
(వాల్మీకి రామాయణం)
ప్రశాసనం లో అన్ని ధర్మపరాయణమైన విషయాలు ఐక్యమవు ఒక ప్రక్రియ చేత రామరాజ్యం అని అర్థమవుతున్నది కానీ శ్రీరాముని ముందూ ఈ భూమి ఉన్నది, తరువాతా ఉన్నది.ఆయన దానిని వెలుగులోకి తెచ్చినట్లు కనిపిస్తుంది...
సత్యము. ధర్మము ఇటు ప్రజలు, అటు పాలకులు ఇరి పక్షాలు అవలంబించి ఆలోచించవలసిన అవసరం ఉన్నది. మీరు చెబుతున్న పాలకులు మనం పంపిస్తున్న వాళ్లే కదా అని ఆలోచించినప్పుడు ప్రక్రియను రివర్స్ చేయటం కనపడుతున్నది.ధర్మపాలన అనేది ముందు బాధ్యతగా ప్రజల మీదకు వచ్చినదా అని ఆలోచించాల్సి ఉన్నది...
మంచి వ్యాసం, మంచి వీడియో అందించారు!ధన్యవాదాలు!
మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు .
శిరాకదంబం గారూ..
64 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
* పద్మార్పిత గారూ !
* అజ్ఞాత గారూ !
* శ్రీపతి గారూ !
* మాలాకుమార్ గారూ !
* రాజీ గారూ !
అందరికీ ధన్యవాదాలు. శ్రీపతి గారూ.... మంచి వివరణ ఇచ్చారు. అభినందనలు.
స్వాతంత్ర్య ఫలాలు అందరికి సమపాళ్ళలో దక్కాలని ఆశిస్తూ మీకు శుభాకాంక్షలు..
happy freedom day...
i dont want 2 feel dependency in independence...
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు .
మీకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
* కేక్యూబ్ గారూ !
* సంతోష్ గారూ !
* అశోక్ పాపాయి గారూ !
* జయ గారూ !
అందరికీ ధన్యవాదాలు
Wonderful video! My hearty greetings to all of you on this occassion.
Post a Comment