నవరసాల నటీమణి ఋష్యేంద్రమణి
1917 నూతన సంవత్సరం రోజున విజయవాడలో జన్మించిన ఋష్యేంద్రమణి తొలిచిత్రం 1935 లో వచ్చిన ' శ్రీకృష్ణతులాభారం ' .అంతకుముందు అతి చిన్నవయసులోనే రంగస్థలాన్ని అలరించింది. కపిలవాయి రామనాథశాస్త్రి, పువ్వుల రామతిలకం లాంటి ప్రముఖ నటుల వద్ద నాటక కళలో ఓనమాలు నేర్చుకుంది.
మొదటి చిత్రం పరాజయం పాలు కావడంతో తిరిగి రంగస్థలాన్ని ఆశ్రయించిన ఋష్యేంద్రమణి ఆమె భర్త జవ్వాది రామకృష్ణారావు నాయుడు ప్రోత్సాహంతో 1942 లో మళ్ళీ ' సీతారామ జననం ' చిత్రంతో పున: ప్రవేశం చేసింది.
తమిళ చిత్రం ' పత్ని ' ( 1942 ) లో తమిళ ఇతిహాసం ' శిలప్పదికారం ' లోని కన్నగి పాత్ర ధరించడంతో ఆమె ప్రతిభ చిత్రరంగంలో తెలిసింది. అప్పటినుండి ఇంక తిరిగి చూడలేదు. అనేక రకాల పాత్రలు వివిధ చిత్రాల్లో పోషించింది.
1943 లోను, 1958 లోను వచ్చిన ' చెంచులక్ష్మి ' చిత్రాలు రెండింటిలో నటించింది. విజయా సంస్థలో చాలా చిత్రాల్లో నటించింది.
హావబావాలు అలవోకగా పలికించడంలోను, నవరసాల్ని అవలీలగా పోషించడంలోను, సంభాషణలు మంచి టైమింగ్ తో పలకడంలోను ఆమెకు ఆమే సాటి.
2002 ఆగష్టు 17 వ తేదీన ఋష్యేంద్రమణి స్వర్గస్థురాలయింది. ఆమె వర్థంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ...
ఆమె నటనా కౌశలాన్ని తెలిపే సన్నివేశాలతో................కళానీరాజనం
Vol. No. 02 Pub. No. 005
9 comments:
రావు గారూ,
నా అభిమాన నటీమణుల్లో ఋష్యేంద్రమణి గారూ ఒకరు. ఉదయాన్నే ఆమెను గుర్తు చేసి క్లిఫ్ఫింగులు చూపించి సంతోషపెట్టారు. ధన్యవాదాలు.
Rao garoo,
Than you for a good article on one of my favorite Actresses.
This is wonderful. I adore Late Rushyendramani's action. A dynamic actress with terrific intonation. There is no replacement for her.
Thanks.
S.R.Rav గారూ!
మీ బ్లాగు superb!
ఎన్నో ఆసక్తికరమైన అంశాలతో ఆహ్లాదకరంగా తీర్చి దిద్దుతున్నారు.
The scenes you have selected are very good. I'had seen only Maayabazar out of the three. What is the name of the third movie? I don't think you mentioned it in your presentation.
* శంకరయ్య గారూ !
* శివ గారూ !
* పాలన పారనంది గారూ !
* కాదంబరి గారూ !
* మాధురి గారూ !
అందరికీ ధన్యవాదాలు. మాధురి గారూ ! ఆ క్లిప్పింగ్ కి సంభందించిన పూర్తి వివరాలు యు ట్యూబ్ లోని http://www.youtube.com/watch?v=0OpK9_8fkcM లింక్ లో వున్నాయి. ఒకసారి చూడండి.
i am impressed by her action in mayabazar -- the way she redered poems are uncomparable and also very balanced to her portion.
తిరుమల దేవి గారూ !
శిరాకదంబానికి స్వాగతం. ధన్యవాదాలు.
Rishyendramani is a great actress.I am 20 years but watched several old movies while my grandmother watching those b&W movies. Rishyedramani acted as adoment mother in Vauhini's Malleeshwari and as a kind mother in NATs Panduranga mahathyam, Gulebhakavali katha Vijayas Jagadeka Veerunikatha with same ease. My grand ma told she was bron in Proddutur, Cuddapah district. Can you please confirm where she was borned Vijayawada or Proddutur? also I didnt see her in BAS "Chenchu Lakshmi" which character she did in this movie?
Many thanks for posting about this great actress.
Post a Comment