రాయప్రోలు సుబ్బారావు గారి కలం నుండి జాలువారిన ఈ దేశభక్తి గీతం
మిత్రుడు పార్థసారధి గళం నుండి
దుగ్గిరాల స్వరం కల్పనతో వినండి.
శ్రీలు పొంగిన జీవగడ్డయు పాలుగారిన భాగ్యసీమయు
రాలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా ! [[ శ్రీలు ]]
వేదశాఖలు పెరిగెనిచ్చట ఆదికావ్యం అందినిచ్చట
వేదశాఖలు పెరిగెనిచ్చట ఆదికావ్యం అందినిచ్చట
బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా !
బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా !! [[ శ్రీలు ]]
నీలి కిన్నెర మేళవించి రాయి కరుగగ రాగమెత్తి
నీలి కిన్నెర మేళవించి రాయి కరుగగ రాగమెత్తి
పాల తీయని బాలభారత పదము పాడరా తమ్ముడా !
పాల తీయని బాలభారత పదము పాడరా తమ్ముడా ! ! [[ శ్రీలు ]]
నవరసమ్ములు నాట్యమాడగా చిగురు పలుకులు చెవులు విందుగా
నవరసమ్ములు నాట్యమాడగా చిగురు పలుకులు చెవులు విందుగా
కవితలల్లిన కాంతి హృదయము గారవింపవే చెల్లెలా !
కవితలల్లిన కాంతి హృదయము గారవింపవే చెల్లెలా ! ! [[ శ్రీలు ]]
పాండవేయుల పదును కత్తుల మండి మెరిసిన మహిత రణకథ
పాండవేయుల పదును కత్తుల మండి మెరిసిన మహిత రణకథ
కండగల చిక్కని తెలుగుంల కలసి పాడరా తమ్ముడా !
కండగల చిక్కని తెలుగుంల కలసి పాడరా తమ్ముడా ! ! [[ శ్రీలు ]]
Vol. No. 01 Pub. No. 370
18 comments:
మంచి మంచి పాటలను పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు మిత్రమా.
అద్భుతం , చక్కని పాటను మరీ మరీ వినేటట్లు చేశారు . ధన్య వాదాలు . ఒక చింతించ వలసిన విషయం యెమంటే ఇంత చక్కని ఆనంద దేశభక్తి గేయాన్ని లీడర్ సినిమా కోసం బాక్ గ్రౌండ్ శాడ్ మ్యూజిక్ గా , హీరో తండ్రి అంత్య క్రియా కర్మ ల లో వాడుకొని దాని విలువను పొగొట్టిన మన డైరెక్టర్ గారు , దానికి అనుమతించిన సెన్సార్ వారు అపవిత్రం చేశారు .
Dear Anonymous,
Everybody likes to know the name of a philanthropist. You should have revealed yours.
Rao garu,
The song simply took me back to my school days.
* భా. రా. రె. గారూ !
కృతజ్ఞతలు
* అజ్ఞాత గారూ !
నిజమేనండీ ! ఇలాంటి విషయాలు వారి వారి విజ్ఞత మీద ఆధారపడి వుంటాయి. ధన్యవాదాలు.
* మాధురి గారూ !
ధన్యవాదాలు
పైన anonymous కామెంట్ నాదే , అది విమర్శ కాదనుకొంటాను.సినేమా చూస్తూ పడ్డ మా బాధ మాత్రమే నా బ్లాగ్ srisri-kavitalu.blogspot.com .ఇంతకు పై పాటను నేను యెక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చో చెప్ప గలరు . మరీ మరీ ధన్యవాదాలతో
రాంబాబు గారూ !
అర్థమయిందండీ ! ఆ పాటను ఇక్కడ వున్న ప్లేయర్ లో కుడిప్రక్క ' Divshare ' ను క్లిక్ చెయ్యండి. నేను అప్లోడ్ చేసిన పేజి తెరుచుకుంటుంది. అక్కడనుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
sir,paata lo 'ralinadi' ani rasaru adi 'raalinada' 'varalinada' ?
chinnappudu,'varalinadi' ante alararindi ane ardham tho padevallam.telupagalaru.thanks
Patriotic composing by talented singer Parthu....Wish you a great success ahead......
Chandu
saarathi gaaruu adbhutam gaa paadaaru. thanks lots
* అజ్ఞాత గారూ !
ధన్యవాదాలు. ఒకసారి పరిశీలించి సరి చేస్తాను.
* చందు గారూ !
* asr గారూ !
ధన్యవాదాలు. మీ ప్రశంసలు పార్థు గారికి చేరుస్తాను.
చాలా మంచిపాటండీ. నాకు ఇప్పటికీ గుర్తుండిపోయిన పాట. కానీ మూడో లైను - వేదశాఖలు వెలిసెనిచ్చట, ఆదికావ్యంబమరెనిచ్చట అని గుర్తు. నేను మరిచిపోయేనో, దీనికి పాఠాంతరం ఉందో మరి. ఏమైనా చక్కనిపాట అనడంలో సందేహం లేదు.
పూర్తిపాఠం ఇచ్చినందుకు ధన్యవాదాలు కూడా.
మాలతి గారూ !
ధన్యవాదాలు. మీరు విన్నది అసలైనదే కావచ్చు. నేను అసలు ప్రతి కోసం ప్రయత్నించి, పరిశీలించి వివరణ ఇస్తాను.
పద్యాలని గుర్తుచేసినందుకు ధన్యవాదాలు
SRRao గారు,
Thanks for reminding us a beautiful song
* సూర్యుడు గారూ !
* లోకేష్ శ్రీకాంత్ గారూ !
ధన్యవాదాలు
chinnappudu school lo teacher garu nerpinchaaru aug 15 kosam ..thank for reminding a beautiful song
ఎన్నెల గారూ !
ధన్యవాదాలు.
Dear Blogger,
"Telugu Tejamu Deepthi Chendaga" ane song chaala chaala baguntundi. Meeku veelu unte, adi upload cheyagalaru.
Itlu,
Sai Praveen Manchiraju.
Post a Comment