జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి
దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు రాసిన ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు దుగ్గిరాల వారి స్వర కల్పనలో ఆలపించారు. మీరూ ఆలకించండి.
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ శతసహస్ర నరనారీ హృదయనేత్రి [[ జయ జయ ]]
జయ జయ సస్యామల సుశ్యామచలచ్చేలాంచల
జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణ కుంతల
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా [[ జయ జయ ]]
జయ దిశాంత గతశకుంత దివ్య గాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పథ విహరణ
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణా
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణా [[ జయ జయ ]]
గమనిక : మిత్రులు ' తెలుగు పద్యం ' బ్లాగు భైరవభట్ల కామేశ్వరరావు గారు పంపిన సమాచారం -
ఈ పాట (సంస్కృతం కదా) అర్థం కావలిస్తే ఇక్కడ చదువుకోవచ్చు:
http://groups.google.com/group/telugu-unicode/browse_thread/thread/488ec5e8ade49ee9?fwc=1pli=1
Vol. No. 01 Pub. No. 364
7 comments:
నాకు ఈ పాట చాలా ఇష్టం, చినప్పుడు ఇది ఎక్కడ దొరుకుతుందో విందాం అని వెతికి వెతికి సాధించాను..
మరొక్క సారి, ధన్యవాదములు..
ఈ పాట ఆగస్ట్15 న పాడేదాన్ని మా స్కూల్ లో..చాలా మంచి పాట
నాక్కూడా చాలా ఇష్టం ఈ పాట. చిరంజీవి రాక్షసుడు సినిమాలో వాడుకున్నట్టున్నారు.
గొప్ప పాట!
రెండు చిన్న దిద్దుబాట్లు:
"జయ జయ సస్యామల సుశ్యామల"
"పథ విహరణ"
ఈ పాట (సంస్కృతం కదా) అర్థం కావలిస్తే ఇక్కడ చదువుకోవచ్చు:
http://groups.google.com/group/telugu-unicode/browse_thread/thread/488ec5e8ade49ee9?fwc=1pli=1
"జయ జయ సస్యామల సుశ్యామచలచ్చేలాంచల"
* తార గారూ !
* నేస్తం గారూ !
* లోకేష్ శ్రీకాంత్ గారూ !
ధన్యవాదాలు
* కామేశ్వరరావు గారూ !
సవరణ పంపినందుకు కృతజ్ఞతలు. సరి చేసాను. మీరిచ్చిన లింక్ కూడా టపాలో పెట్టాను. ఇంకా కొన్ని దేశభక్తి గీతాలు ఇస్తున్నాను. అన్నీ విని రాసినవే ! వాటిలో కూడా ఏమైనా తప్పులు మీ దృష్టికి వస్తే తెలియజెయ్యండి.
వేణుగోపాలరావు గారూ !
ధన్యవాదాలు
Post a Comment