Tuesday, August 3, 2010

విశాల విశ్వంలో నా భారతదేశం ఉన్నతం

 Friendship day సందేశానికి జవాబిస్తూ  మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది ...........................................
రావుగారూ ధన్యవాదాలు.
"  విశాల విశ్వంలో నా భారతదేశం ఉన్నతం"  అనే పాట (గాయని తెలియదు) గతంలో ఎయిర్ టెల్ వారు హలో ట్యూన్ గా పెట్టారు.ఇప్పుడు ఆ పాట లేదంటున్నారు.అది దొరికే అవకాశం ఉందా
?
.............................................................
ఇదీ ఆ పరీక్ష . సుమారు దశాబ్దకాలం క్రితం  ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన "  మా తెలుగు తల్లి " కేసెట్లో ఈ పాట వున్నట్లు తెలుసు. కానీ ఈ సీడీల యుగంలో మూలన పెట్టేసిన కేసెట్లలో ఎక్కడ వెదకాలి ? మొత్తానికి గాలించి ఆ కేసెట్ పట్టుకున్నాను. దాన్ని డిజిటలైజ్ చెయ్యడం మరో పెద్ద సమస్య. ఎందుకంటే కేసేట్లతో బాటే మ్యూజిక్ ప్లేయర్ ప్రభంజనంతో కేసెట్ ప్లేయర్ కూడా మూలన పెట్టేశాం. దాని దుమ్ము దులిపి పనిచేయించి ఈ పాట సిస్టం లోకి పంపి మొత్తానికి రహమతుల్లా గారికి అందించాను.

" మా తెలుగు తల్లి " కేసెట్ విడుదలైనపుడు మా పిల్లలు చిన్నవాళ్ళు. ఈ కేసెట్ కొని తెస్తే అదే పనిగా ఆ పాటలు పెట్టుకుని విని అవి నేర్చేసుకుని ఆగష్టు 15 కు స్కూల్లో ఈ పాటలు పాడేసారు. ముఖ్యంగా ' విశాల విశ్వంలో నా భారత దేశం ఉన్నతం '  పాట వాళ్లకు స్కూల్లో ఓ గుర్తింపు తెచ్చింది. ఇదో మధురమైన జ్ఞాపకం, మాకు మాపిల్లలకి. నిన్న ఇది బయిటకు తియ్యగానే అందరం ఓసారి గుర్తుచేసుకున్నాం. ఈ స్వాతంత్ర్యదినోత్సవ సంబరాల మాసంలో మిత్రులు తమ పిల్లలకు కూడా ఈ పాటను పరిచయం చేస్తే బాగుంటుంది. 

మిత్రులు రహమతుల్లా గారికి ఆ పాట పంపిన గంటన్నర లోపే నాకు జవాబిచ్చారు, ఆ పాట విని సాహిత్యాన్ని రాస్తూ. ఆ జవాబిదిగో...............
......................................................................
ధన్యవాదాలు రావుగారూ
ఇక్బాల్ గారి సారే జహాసే అచ్చాకు ఏమాత్రం తీసిపోకుండా అనువాదం జరిగింది.నిత్యసంతోషిణి గారు బాగా పాడారు.అనువాదకుడి పేరు కూడా తెలిస్తే ఇంకా బాగుండేది.లిరిక్ నేనే విని టైపు చేశాను.మీ బ్లాగులో దీనిని ఉంచగలరు.



విశాల విశ్వంలో నా భారతదేశం ఉన్నతం
సుస్వరాలమూ మేమూ మధుర వీణ నాదేశం దేశం [[విశాల]]

ధృఢమైన పర్వతములతో ఆకాశాన్నందే నగం
ఆ నగం మాదే ఆ హిమనగం మాదే మాదే [[విశాల]]

ఈదేశ మాత ఒడిలో ఆడులేవేళ నదులూ
ఈ సుందరనందన వనమే
స్వర్గానికన్న మిన్న మిన్నా [[విశాల]]

ఏమతమైనా కానీ కలహించడమూ నేర్పదూ
భారతీయులం మనమూ భారతదేశం మనదీ అనాదీ [[విశాల]]
 ...................................................
కేసెట్ మీద వున్న ఈ పాట వివరాలు -
గానం : నిత్యసంతోషిణి ; రచన : జంగా సత్యదేవ్ శర్మ ; సంగీతం : దుగ్గిరాల

ఈ పాటను వెలికి తీయించిన మిత్రులు నూర్ రహమతుల్లా గారికి కృతజ్ఞతలతో ........ ఆ పాట మీకోసం .........................................



Vol. No. 01 Pub. No. 362

6 comments:

Khammam said...

Thanks a lot for your and to rahamthulla gaariki

Vinay Datta said...

Thanks for the song. I suggest you digitalize all your cassettes whenever you get time. Ofcourse, it must be expensive apart from being exciting.

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

Excellent song sir. Thanks for sharing it with us.

Nrahamthulla said...

రావుగారూ
ఇక దొరకవు అని నేను ఆశలు వదులుకున్న పాటలలో మీద్వారా లభించిన రెండవ పాట ఇది. మీరు శ్రమపడి వెతికి ఈ పాటను పట్టుకొని డిజిటలైజ్ చేసి ఇలా అందరికీ అందుబాటులోకి తేవటం మహదానందంగా ఉంది.ఆగస్టు పదిహేను వస్తున్నది.అందరం పాడుదాం ఈ పాట.
నూర్ బాషా రహంతుల్లా.

SRRao said...

* ఖమ్మం గారూ !
ధన్యవాదాలు

* మాధురి గారూ !
మీరు చెప్పింది నిజమే ! కొన్ని కేసెట్లు డిజిటలైజ్ చేసాను. అన్నీ చెయ్యడానికి సమయాభావమే అడ్డంకి ! అయినా మళ్ళీ ప్రారంభిస్తాను. ధన్యవాదాలు.

* లక్ష్మినారాయణ సునీల్ వైద్యభూషణ గారూ !
ధన్యవాదాలు

* రహమతుల్లా గారూ !
అన్ని పాటలు నా దగ్గర లేకపోయినా మీరడిగినవి అందించగలిగాను. చాలా ఆనందంగా వుంది. ఇంకా చాలా పాటలు, రేడియో సంగీత కచేరీలు రికార్డు చేసుకున్నా ఆ కేసెట్లలో అన్యాక్రాంతమైనవి, పాడైపోయినవి చాలా పోగొట్టుకున్నాను. అప్పట్లో డిజిటలైజేషన్ ప్రక్రియ లేకపోవడం ఓ పెద్ద ఇబ్బంది.
' మా తెలుగు తల్లి ' కేసెట్లో ఇంకా బాలు గారు, నిత్యసంతోషిణి, మిత్రుడు పార్థసారధి పాడిన ప్రముఖ దేశభక్తి గీతాలున్నాయి. అవి కూడా వీలుచూసుకుని అందిస్తాను.

Unknown said...

పెద్దలు అందరికీ నమస్కారాలు..! ఈ పాటను నేను చిన్నప్పుడు మా పాఠశాల లో పాడాను..! ఎంతో చక్కనైన పాట.
అంతర్జాలం లో చాలా వెతికాను.. కానీ నాకు దొరకలేదు.
కావున ఈ ఒరిజినల్ పాట ఎవరి దగరైన ఉంటే నాకు పంపగలరు... ధన్యవాదాలు..!

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం