Sunday, October 18, 2009
విశ్వనాథ వారి చెణుకులు
ఈ రోజు కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి వర్థంతి. ఆయన సాహిత్యం గురించి చెప్పనక్కర్లేదు. ఆయన వ్యాఖ్యల్లో మాత్రం హాస్యం తొంగిచూసేది. ఆయనకు నివాళులర్పిస్తూ....
* విశ్వనాథ వారి ' శివార్పణం ' పద్యకావ్యం ఆవిష్కరణ సభ జరుగుతోంది. ఆయన్ని గుమ్మడి గారుసత్కరిస్తారని ప్రకటించారు. అలాగే గుమ్మడి గారు సత్కరించారు. దానికి విశ్వనాథ వారు " గుమ్మడి అంటే ఈయనా ? నేనింకా గుమ్మడి సత్కారమంటే గుమ్మడికాయనిస్తారేమో అనుకున్నాను " అన్నారట.
* విశ్వనాథ వారు బందరులో ఉండే రోజుల్లో ఆయన మిత్రుడొకాయన ఆ ఊరు వచ్చి " మీ ఊరి నిండా గాడిదలేఉన్నట్లున్నాయే ! " అన్నాడు వ్యంగ్యంగా. దానికి విశ్వనాథ వారు " అవును. నిజమే ! ఉన్నవి చాలవన్నట్లుఅప్పుడప్పుడు పొరుగూరి గాడిదలు కూడా వచ్చిపోతుంటాయి " అన్నారు.
* ఒక చిత్ర నిర్మాతకు విశ్వనాథ వారి ' వేయిపడగలు ' ని సినిమా గా తీస్తే బాగుంటుంది అనిపించింది. ఆయన్ని కలిసాడు. విశ్వనాథ వారు ఇరవై వేలు పారితోషికం అడిగారు. దాంతో ఆ నిర్మాతకు మతి పోయినట్లయింది. ఏం చెయ్యాలో తోచక " అంత ఇచ్చుకోలేను. రెండు వేలు ఇచ్చుకుంటాను. ఓ వంద పడగల్ని ఇప్పించండి " అన్నాడు. ఈసారి విస్తుపోవడం విశ్వనాథ వారి వంతయింది.
* విశ్వనాథ వారు ఒక పని మీద సచివాలయం చుట్టూ చాలాసార్లు తిరిగి విసుగెత్తి, అప్పటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారిని కలిసి విషయం చెప్పారు. ఆయన " అదొక పెద్ద అడివి. దానిలో పని జరిపించుకోవడం అంత సులభం కాదు" అన్నారు. " మీరు ఆంద్ర కేసరి కదా ! ఆ అడవి మీకొక లెఖ్ఖా ? అందుకే మీ దగ్గరకు వచ్చింది " అన్నారు విశ్వనాథ వారు ప్రకాశం గారిని ఇరుకునబెడుతూ.
Subscribe to:
Post Comments (Atom)
ప్రాచుర్యం
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
7 comments:
బాగున్నాయండి, మీ చెణుకులు.
జయ గారూ !
ఆ చెణుకులు నావి కావండి. విశ్వనాథ వారివి. ఏమైనా మీకు నచ్చినందుకు సంతోషం.
చణుకులు చర్నకోలలు భలే వున్నాయండి. సున్నిత హాస్యం.
రెండవది బాగా నవ్వించింది.
word verification తీసివేస్తే బాగుంటుందేమో!
భా.రా.రె.గారూ !
ధన్యవాదాలు.
విజయమోహన్ గారూ !
సంతోషం. word verification తీసివేస్తే బాగుంటుందన్నారు. అర్థం కాలేదు. కొంచెం వివరించగలరా !
బాగున్నాయి ఆయన చెణుకులు మీరు గుర్తు చేయటం.. రెండూనూ..
భావన గారూ !
ధన్యవాదాలు
Post a Comment