జల సూత్రం రుక్మిణీనాధ శాస్త్రి అంటే చాలామందికి తెలియక పోవచ్చు. జరుక్ శాస్త్రి లేదా పేరడీ శాస్త్రి అంటే టక్కున గుర్తు పట్టేస్తారు. హాస్యం, వ్యంగ్యం ఆయన రచనల్లో ప్రధాన వస్తువు.
అవి ఆయన మాటల్లో కూడా తొణికిసలాడేవి. ఆ రోజుల్లో ప్రముఖ కవులందరి రచనల మీదా
ఆయన రాసిన పేరడీలు చాలా ప్రాచుర్యాన్ని పొందాయి.
* " మీ ఇంటిపేరు తమాషాగా ఉందండీ ! " అని ఎవరో ఆయనతో అంటే " అదా ! నీటి ఫార్ములా H 2 O కదా ? అది మావాళ్ళే కనిపెట్టారట. అందుకే మా ఇంటి పేరు జలసూత్రం అయింది' అన్నారు.
* ' మధుకీల ' అనే కావ్యాన్ని మల్లవరపు విశ్వేశ్వర రావు అనే కవి రచించారు. దానికి ముందుమాట కృష్ణశాస్త్రి గారు రాసారు. అందులో ' విశ్వేశ్వరరావూ ! నీవు కవివయ్యా ! నేను ఎవరితోనూ ఇలా అనను.విశ్వేశ్వర రావు నిజంగా కవి '; అని రాసారు. దీనికి జరుక్ శాస్త్రి గారి పేరడీ...... ' సుబ్బారావూ ! నువ్వింకా క్షవరం చేయించులోవాలయ్యా ! నీ తల మాసిందయ్యా ! నేను ఎవరితోనూ ఇలా అనను. సుబ్బారావు నిజంగా తలమాసిన వాడు "
* " అసలీ పేరడీలు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? " అని ఆయన్ని ఎవరో అడిగారు. " మా తండ్రి గారి దగ్గర " అన్నారు టక్కున. వాళ్ళు షాక్ నుంచి తేరుకున్నాక తాపీగా " నిజానికి నాకూ కృష్ణశాస్త్రికీ పెద్దగా తేడా ఏమీ లేదు. మా తండ్రి గారు నాక్కూడా కృష్ణశాస్త్రి అని పేరు పెట్టి ఉండొచ్చు. కానీ బెంగాలీలను పేరడీ చేసి తెలుగు వాళ్ళలో ఎవరికీ లేని పేరు పెట్టలేదూ ! " అన్నారట.
ఇదండీ ఆయన వరస.....ఇంతేనా ? ఇంతేనా అంటే ఇంకా చాలా ఉన్నాయి . మీకూ , నాకూ కాంప్రమైజేషన్ కుదిరాక చెప్తాను . సరేనా !
1 comment:
మీ దగ్గర చాలా సాహిత్య కబుర్లు ఉన్నాయండీ. త్వర త్వరగా పంచండి.
Post a Comment