కనుక్కోండి చూద్దాం - 55
1939 లో వాహినీ వారు నిర్మించిన ' వందేమాతరం ' చిత్రంలో ప్రధాన కథాంశం నిజానికి స్వాతంత్ర్యోద్యమం కాదు. నిరుద్యోగ సమస్య. అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఆ పేరు చూసి నిషేదిస్తుందేమోననే సందేహంతో ఇంకో పేరు కూడా పెట్టారు. అసలు పేరు ' వందేమాతరం ' క్రిందనే చిన్న అక్షరాలలో ఉపశీర్షికగా ఆ పేరు వేసేవారు.
రాజకీయవేత్తగా, కొన్ని రాష్ట్రాలకు గవర్నర్ గా కూడా పని చేసిన ఒకప్పటి కథానాయకుడు, నిర్మాత, దర్శకుడు 1944 లో నిర్మించిన ఒక చిత్రానికి అదే పేరు పెట్టారు. అంతే కాదు ఆ చిత్రానికి మొదట వేరే పేరు ప్రకటించి, ప్రొడక్షన్ దశలోనే ఇంకో పేరు మార్చి, చివరికి అది పూర్తయి విడుదల చేసే ముందు ఈ పేరు ఖరారు చేసారు.
అ ) 1939 లో ఉపశీర్షికగా, 1944 లో ప్రథాన శీర్షికగా వచ్చిన ఆ పేరు ఏమిటి ?
ఆ ) 1944 లో వచ్చిన చిత్రం మొదటి రెండు పేర్లు ఏమిటి ?
ఇ ) 1944 లో వచ్చిన ఆ కథానాయకుడు, నిర్మాత, గవర్నర్ ఎవరు ?
Vol. No. 03 Pub. No. 057
3 comments:
1 మంగళసూత్రం
2.మంగళసూత్రం (1944 కాదు 1946) (మొదట ఏ పేరు పెట్టారో తెలియదు)
3.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకరుగా, రాష్త్ర ఆర్ధికశాఖ మంత్రిగా, పాండిచేరి గవర్నర్ గా పనిచేసిన కోన ప్రభాకర్ రావు గారు
devikasaiganeshgaru correct ga chepparu.kona prabhakararaogaru drohi cinemalo vilan ga koodaa vesaaru. ramanarao.muddu
* దేవిక గారూ !
* రమణారావు గారూ !
ధన్యవాదాలు. జవాబులు ప్రచురించను. చూడగలరు.
Post a Comment