మహాకవి శ్రీశ్రీ గారికి కూడా కొన్ని కోరికలుండేవి. అయితే అవి తీరని కోరికలే ! ఎందుకంటే అవి తీరకుండానే ఆయన మరణించారు. వాటిలో ముఖ్యమైన కొన్ని ...........
* ఆయనకు రెండు కథల మీద మోజుగా వుండేది. అవి ఒకటి రుక్మిణీ కళ్యాణం కథ. మరోటి కవి తిక్కన - ఖడ్గతిక్కన, ఈ ఇద్దరి జీవితాలలోని విశేషాలను మిళితం చేసి ఒకే కథగా రూపొందించాలని ఆయన కోరిక. అంతే కాదు. ఈ రుక్మిణీ కళ్యాణం కథనీ, కవి - ఖడ్గ తిక్కన కథనీ చలన చిత్రాలుగా తీయాలని కోరికగా వుండేది.
* " నెరవేరితే నిలువుటద్దం సైజులో ' మహాప్రస్థానం ' ను ఆచ్చువేయించాలని ఉంది. ఇవి గొంతెమ్మ కోరికలే ! నా జన్మలో నేరవేరుతాయా ? " అనేవారట ఆ మహాకవి.
చివరకి ఈ రెండు కోరికలూ నెరవేరలేదు. ఆ మహాకవి శత జయంతి సందర్భంగా ఎవరైనా పూనుకుని కనీసం ఆయన రెండో కోరికైన ' మహాప్రస్థానం ' నిలువుటద్దం సైజులో అచ్చు వేయిస్తే ఆయన కోరిక నేరవేర్చినట్లుంటుంది. ఎవరైనా ఆలోచిస్తే బాగుండును.
మహాప్రస్థానం
మహాప్రస్థానం: మహాకావ్యం
శ్రీ శ్రీ మహాప్రస్థానం: సమాలోచనం
ఆ మహాకవికి ఇష్టమైన పాటలుగా పేర్కొన్న వాటిలో ఒకటి ' తోడికోడళ్ళు ' చిత్రంలో ' నలుగురు కలసి, పొరువులు మరచి, చెయ్యాలి ఉమ్మడి వ్యవసాయం ' ........ మీకోసం........
Vol. No. 01 Pub. No. 276
5 comments:
it is not poddulu.sounds like urukulu marichi.
అజ్ఞాత గారూ !
ధన్యవాదాలండీ ! తొందరలో జరిగిన పొరబాటును సూచించినందుకు చాలా సంతోషం. అయితే ' ఉరుకులు ' కూడా కాదండీ ! ఆమాట ' పొరువులు '. సరిచేసాను.
ఆ మహాకవి కోరికలు నెరవేరాలని కోరుకుంటూ...
good, timely song. I remember all the songs in the movie except this. Noe I understand the meaning better.
మాధురి గారూ !
ధన్యవాదాలు. మీరేమీ అనుకోకపోతే ఒక మాట. మీ వ్యాఖ్యలు తెలుగులో రాయకూడదూ ! ఇంగ్లీష్ లో అందగానే వున్నాయి. కానీ తెలుగు బ్లాగ్ కదా తెలుగులో అయితే బాగుంటుందని.
Post a Comment