కనుక్కోండి చూద్దాం - 15
గుజ్జనగూళ్ళు ........
ఇప్పటితరం వారికి తెలియదేమో కానీ నాల్గయిదు దశాబ్దాల క్రితం వరకూ అంటే టీవీ అనేది లేని రోజుల్లో పిల్లలందరూ సాయింత్రం హాయిగా ఆరుబయిట రకరకాల ఆటలు ఆడుకునేవారు.
అప్పటి తరానికి చెందిన వారికి ముఖ్యంగా సోదరీమణులకు ఈ ఆట గురించి బాగా తెలిసి వుంటుంది.
ఈ ఆట ఆడే విధానాలలో అనేక రకాలున్నట్లుగా తెలుస్తోంది.
తమకు తెలిసిన విధానాల గురించి మిత్రులెవరైనా వివరించగలరా ?
ఇక అసలు ప్రశ్న - ' గుజ్జనగూళ్ళు ' అనే మాటకు అర్థమేమిటి ? దాని పూర్వాపరాలేమిటి ?
Vol. No. 01 Pub. No. 243
2 comments:
నాకు తెలిసి గుజ్జన గూళ్ళు అంటే, చిన్నపిల్లలే వంటలు చేసుకుని వీలైనంత మంది పెద్దవాళ్ళకి, ఇంకా తమ తోటి పిల్లలకి వడ్డించి, తాము కూడా తినే ఆట. గుజ్జన అన్న పదం పూర్తిగా విశ్లేషించ లేక పోయినా, గూళ్ళు మాత్రం, సంధి కలిసిన 'కూళ్ళు' అన్న పదం.
ఇరవై ఏళ్ళ క్రితం నేను కూడా ఆడిన ఆట ఇది. ఆడ, మగ భేదం లేదు దీనికి.
సీతారామం
సీతారాం గారూ !
ధన్యవాదాలు. మీరు చెప్పింది చాలా వరకూ దగ్గరగానే వుంది. పూర్తి వివరాలు కొత్త టపాలో చదవండి.
Post a Comment