మహిళలు తలచుకుంటే సాధించలేనిది లేదని తెలుగు చలన చిత్ర రంగం ఆవిర్భవించిన తొలినాళ్ళలోనే నిరూపించారు కొందరు మహిళలు. వారిలో మొదటి మహిళా తెలుగు నిర్మాతగా దాసరి కోటిరత్నం గురించి గతంలో టపా రాయడం జరిగింది.
మరో మూడేళ్ళకు అంటే 1938 లో విశాఖపట్నానికి చెందిన ఆంధ్రా సినీ టోన్ అనే చిత్ర నిర్మాణ సంస్థ ( ఆ పేరుతోనే విశాఖలో ఫిలిం స్టూడియో కూడా నిర్వహించారు ) ' భక్త జయదేవ ' అనే చిత్రాన్ని ప్రారంభించారు. ఆ చిత్రంలో రెండుచింతల సత్యనారాయణ, సురభి కమలాబాయి ముఖ్య పాత్రధారులు. ఆ చిత్రానికి హిరెన్ బోస్ అనే బెంగాలీ ఆయన దర్శకుడు. అయితే ఆయన సాంకేతిక పరిజ్ఞానం అంతంత మాత్రం కావడంతో చిత్ర నిర్మాణం సరిగా సాగలేదు. నిర్మాతలకు భారీగా నష్టం వచ్చే పరిస్థితి.
నిర్మాణం ఆగిపోతొందన్న అందరి అందోళనలను తొలగిస్తూ దర్శకత్వంతో బాటు ఎడిటింగ్ కూడా నిర్వహిస్తూ, కథానాయిక పాత్ర ధరించి ఆ చిత్రాన్ని పూర్తి చేసి అందర్నీ ఆశ్చర్యపరచిన నారీ శిరోమణి ' సురభి కమలాబాయి ' . తొలి తెలుగు కథానాయిక ( భక్త ప్రహ్లాద - 1931 ) కాక తొలి మహిళా దర్శకురాలిగా కమలాబాయి ని చెప్పుకోవచ్చు. అయితే చిత్రం టైటిల్స్ లో హిరెన్ బోస్ పేరే కనబడుతుంది. చివరకు డబ్బాల్లో మగ్గిపోకుండా ఆ చిత్రం పూర్తయి విడుదల చేసేందుకు కారణభూతురాలు ఒక మహిళ కావడం, అదీ తెలుగు చిత్రరంగం ఇంకా శైశవ దశలోనే ఉన్న రోజుల్లో అవడం విశేషమే కదా !
నటుల్నీ, సాంకేతిక నిపుణులని సంఘటితపరచి ఆదాయాన్ని అందరూ సమంగా అనుభవించాలనే సిద్ధాంతాన్ని ఆనాడే అమలుపరచిన తొలి తెలుగు మహిళా నిర్మాత దాసరి కోటిరత్నం.
ఈనాడు మన చిత్రసీమలో ఎక్కడికెళ్ళినా వినిపించే మాట " నిర్మాత బాగుంటే పరిశ్రమ బాగుంటుంది ". కానీ ఆ మాట అమలు కొచ్చేసరికి శూన్యమే ! చిత్రం ప్రారంభించేవరకే నిర్మాత పాత్ర అవుతోంది. అనేక కారణాలవలన చిత్రం ఆగిపోతే పట్టించుకుని ఆ నిర్మాతకు అండగా నిలబడే వారే కరువయ్యారు. చాలా సందర్భాల్లో అనేక చిత్రాలు మధ్యలోనే ఆగిపోవడం, లేదా విడుదలకు నోచుకోకపోవడం సర్వ సాధారణమైపోయింది. అయితే నిర్మాత సంక్షేమమే పరిశ్రమ సంక్షేమం అని మాటలతో కాక చేతలతో ఆనాడే నిరూపించిన మరో మహిళ సురభి కమలాబాయి.
ఈ ఇద్దర్నీ చిత్ర పరిశ్రమ - ముఖ్యంగా పరిశ్రమలోని మహిళామణులు అప్పుడప్పుడైనా స్మరించుకుంటే బాగుంటుంది.
Search Amazon.com DVD for telugu movies dvd
The songs of Tyāgarāja: English translation with originals (The heritage of Andhra)
Vol. No. 01 Pub. No. 260
Subscribe to:
Post Comments (Atom)
ప్రాచుర్యం
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
2 comments:
Thanks for telling us the 'hidden' talent of Surabhi Kamalabai. The notes about Dasari Kotiratnam is inspiring.
Are Dasari's descendants in the field now?
మాధురి గారూ !
ధన్యవాదాలు. ప్రస్తుతం దాసరి కోటిరత్నంగారి వారసులేవరూ పరిశ్రమలో వున్నట్లు నా దగ్గర సమాచారం లేదు. ఆ సమాచారం ఎవరిదగ్గరైనా వుంటే తెలియజేస్తే బాగుంటుంది.
Post a Comment