ఆయన చెప్పిన మంచి మాటలు -
నీవు కోరుకున్నట్లు జరిగిందా మంచిదే. జరుగలేదూ మరీ మంచిది. మనకు తెలియకుండానే మనను నడిపించే శక్తి ఏదో - భగవంతుడో, సర్వేశ్వరుడో, మరేదైనా అను - మనకు ఒక గుణపాఠం నేర్పడానికే అలా చేసిందని భావించు. ఆ శక్తి మనకెన్నడూ అపకారం చెయ్యదు. ఆ సంగతి నీవు సంక్షోభంలో, సమస్యల్లో వున్నప్పుడు గ్రహించకపోయినా తర్వాత గుర్తిస్తావు.
ఆచార్య ఆత్రేయ గారు మురళీకృష్ణ చిత్రం కోసం రాసిన, మాస్టర్ వేణు సంగీతంలో ఘంటసాల గానం చేసిన ఈ పాటలోని చరణాన్ని వింటే ఈ ఇద్దరి కవుల భావ సారూప్యాన్ని గమనించవచ్చు.
Vol. No. 01 Pub. No. 244
3 comments:
హరివంశ్ రాయ్ బచ్చన్ గారు వ్రాసిన మధుశాల అనే కవితా సంపుటి కూడా చాలా ప్రసిద్ధి చెందింది. అందులోని కొన్ని భాగాల్ని డిగ్రీ స్థాయిలో పాఠ్యాంశంగా పెట్టారు.
అందులోని కవితల్ని అమితాబ్ గారు ఏ సాహిత్య సమావేశానికి హాజరయినా ఎంతో సంతోషంగానూ, బాధ్యతతోనూ, తండ్రి పట్ల గౌరవంతోనూ చదివి వినిపిస్తుంటారు.
చాలా మంచి విషయం చెప్పారండి. చాలా పాత సినిమ, మనసే మందిరం లో పాట కూడా ఈ విషయాన్నే గుర్తుచేస్తుంది. తలచినదే జరిగినదా దైవం ఎందులకు...జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు...అని
* మందాకిని గారూ !
ధన్యవాదాలు.
* జయ గారూ !
ధన్యవాదాలు. మరో మంచి పాత గుర్తుచేశారు. చాలా సంతోషం.
Post a Comment