Tuesday, April 20, 2010

ఉరుములేని పిడుగు

నెల్లూరు నెరజాణలంటే ఎంత ప్రసిద్దో వేరే చెప్పనక్కరలేదు.
హరికథలకు ఆదిభట్ల నారాయణదాసు గారు ఎంత ప్రసిద్ధులో చెప్పాలా ?
నెల్లూరు నెరజాణలకు, దాసుగారికి సంభంధం ఏమిటంటారా ..............

ఆదిభట్లవారు హరికథలలోనే కాదు... రసికతలోనూ లబ్ద ప్రతిష్టులే !
ఒకసారి ఆయన నెల్లూరు వెళ్ళడం తటస్థించింది. సరే ! ఎలాగూ నెల్లూరుకొచ్చాం కదా ఈ నెరజాణల సంగతేంటో చూద్దాం అని బయిల్దేరారు. అలా వీధి వెంట నడుస్తుండగా ఒక ఇంటి గుమ్మంలో నిలబడిన ' జాణ ' నారాయణ దాసు గారి మీద చెంబుడు నీళ్ళు చల్లి ' మబ్బులేని వాన ' అంది నవ్వుతూ ......

దాంతో ఆదిభట్ల వారు ఉలిక్కిపడ్డారు. ఆశ్చర్య పోయారు. కొంచెం కోపం కూడా వచ్చింది. ఆ నెరజాణకు తగిన శాస్తి చేయ్యాలనుకున్నారు.
అంతే ! ఒక్క అంగలో ఆమె దగ్గరకెళ్ళి వీపు వంచి ఒక్క పిడిగుద్దు వేసి ' ఉరుములేని పిడుగు ' అని వెనక్కి వచ్చేశారు.

Harikatha pitamaha Srimadajjadadibhatta Srinarayanadasa jivita caritramu: Yaksaganamu
Harikatha pitamaha Srimadjjadadi Bhatla Narayanadasa jayantutsava sancita
Search Amazon.com ClassicalMusic for karnatic
 Vol. No. 01 Pub. No. 259

3 comments:

Ravi said...

భలే ఉంది చమత్కారం. నెల్లూరి నెరజాణలంటే ఇప్పటికీ ఓ అభిప్రాయం ఉంది. పెళ్ళి చేసుకుంటే ఖచ్చితంగా వేరు కాపురం పెట్టించేస్తారని :-)

Padmarpita said...

భలే..భలే:):)

SRRao said...

* రవిచంద్ర గారూ !
* పద్మార్పిత గారూ !

ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం