Friday, April 23, 2010

హిందీ చిత్ర సీమలో తొలి తెలుగు హీరో

హిందీ చిత్ర సీమలో మన తెలుగు నటీమణులు వహీదా రెహ్మాన్, రేఖ, శ్రీదేవి లాంటి వారు విజయ బావుటా నెగురవేసారు. కానీ తెలుగు నటులు హిందీలో పేరు తెచ్చుకున్న సందర్భాలు చాలా తక్కువ.  అందులో తొలితరంలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ వ్యక్తి మనకందరికీ బాగా తెలిసిన ఎల్వీ ప్రసాద్. ఈయన తొలి భారతీయ టాకీ చిత్రం ' ఆలం ఆరా ' లో రెండు, మూడు వేషాలను వేశారు. 

అంతకుముందే అంటే మూకీ యుగంలోనే బొంబాయి చిత్రసీమలో ప్రవేశించి హీరోగా ఎదిగి హిందీ , ఉర్దూ మొదలైన భాషల్లో సుమారు 170 చిత్రాల్లో నటించిన తెలుగువాడు పైడి జైరాజ్. వీటిలో అధిక భాగం హిందీ చిత్రాలే !

భారత కోకిల సరోజినీ నాయుడు జైరాజ్ కు పినతల్లి అవుతారు. కరీంనగర్ జిల్లాకు చెందిన జైరాజ్ హైదరాబాద్ నిజాం కాలేజీ లో చదివి సినిమాలపై మోజుతో 1929 లో ముంబాయి చేరుకున్నారు. తన ఇరవైయ్యోయేట 1930 లో తొలిసారిగా " స్పార్క్లింగ్ యూత్ " అనే మూకీ చిత్రంలో నటించారు. అదే సంవత్సరంలో " ట్రయంఫ్ ఆఫ్ లవ్ " అనే చిత్రంలో కథానాయకునిగా నటించారు. జైరాజ్ మొత్తం 11 మూకీ చిత్రాల్లో నటించారు.  1931 లో ప్రారంభమైన టాకీ యుగంలో ఆయన " షికారి " ఉర్దూ చిత్రంతో టాకీల్లో ప్రవేశించారు. తర్వాత కాలంలో శాంతారాం, పృధ్వీరాజ్ కపూర్ లాంటి పెద్ద హీరోల సరసన మరో పెద్ద హీరో గా పేరు తెచ్చుకున్నారు. నిరుపారాయ్, శశికళ, దేవికారాణి, మీనాకుమారి లాంటి హీరొయిన్ ల సరసన నటించారు. అనేక విజయాలనూ చవిచూశారు.

నటుడిగానే కాక మొహర్, మాలా, ప్రతిమ, సాగర్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇందులో ' సాగర్ ' చిత్రానికి నిర్మాత కూడా ఆయనే ! ఎక్కువగా షాజహాన్, పృధ్వీరాజ్ చౌహాన్, రాణా ప్రతాప్, టిప్పు సుల్తాన్, అల్లావుద్దీన్, చంద్రశేఖర ఆజాద్ లాంటి చారిత్రక పాత్రల్ని ధరించిన జైరాజ్ తెలుగు వాడై వుండి కూడా  ఒక్క తెలుగు చిత్రంలోనూ నటించకపోవడం విచారకరం.   

భారత చలన చిత్ర రంగానికి విశిష్ట సేవలందించిన ప్రముఖులకు భారత ప్రభుత్వం ప్రదానం చేసే ప్రతిష్టాత్మక పురస్కారం ' దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ' జైరాజ్ కు 1980 లో లభించింది.

SHAHJEHAN
Leatherface [VHS] 
Chhoti Bahu [VHS]



Vol. No. 01 Pub. No. 265

2 comments:

Saahitya Abhimaani said...

తెలుగు నటీమణులు , రేఖ, శ్రీదేవి ?? వాళ్ళు తెలుగు సినిమాల్లో నటించిన తమిళులు కదా. తెలుగు నటీమణులు ఎలా అవుతారు!

SRRao said...

శివ గారూ !

శ్రీదేవి తమిళంలో చేసినా తెలుగు నటిగానే ప్రసిద్ధి చెందింది రేఖ తల్లి పుష్పవల్లి తెలుగు నటి. ఆమె తొలిసారిగా తెరమీద కనిపించిన చిత్రం ' రంగులరాట్నం '. తర్వాత హిందీ చిత్రసీమలో అడుగుపెట్టింది.
వహీదా రెహ్మాన్ విషయంలో కూడా ఆమె తొలిసారిగా కనబడింది తెలుగు తెరమీదే కదా ! అయితే ఇక్కడో కన్ఫ్యూజన్. 'రోజులు మారాయి ' చిత్రం ద్విభాషా చిత్రం. మీరన్న ప్రాంతీయత విషయానికి వస్తే ఈ విషయం పొరబాటు కావచ్చు.

అయితే నేను ప్రాంతీయత విషయంలో కాకుండా పైన చెప్పిన అంశాలను దృష్టిలో ఉంచుకుని అలా రాసాను. ఏమైనా కొంచెం ఆలస్యంగా ఈ విషయాలను వెలికి తీసినందుకు ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం