1931 లో తెలుగు సినిమాకు మాటలోస్తే తెలుగునాట చిత్ర ప్రదర్శనశాలలు మూకీ నుంచి టాకీలుగా మారడానికి మరో మూడు సంవత్సరాలు పట్టింది. 1934 వరకూ ప్రదర్శన శాలల్లో టాకీలు ప్రదర్శించేటపుడు మద్రాస్, బెంగుళూరు లనుంచి సౌండ్ బాక్స్ లు తెచ్చి మాటలు విడిగా వినిపించేవారు. సౌండ్ ప్రొజెక్టర్లు లేకపోవడమే దీనికి కారణం. ఆ పరిస్థితినుంచి మూకీ ప్రదర్శనశాలల్ని టాకీ ప్రదర్శనశాలలుగా మార్పించిన ఘనత 1934 లో వచ్చిన తొలి లవకుశ చిత్రానికి దక్కింది.
చిత్తజల్లు పుల్లయ్య గారి దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రంలో పారేపల్లి సుబ్బారావు రాముడిగా నటించారు. ఆయన రంగస్థలం నటులు. అక్కడ ఆయన ' రాధ ' వేషానికి ప్రసిద్ధులు. సీతగా శ్రీరంజని నటించింది. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. దాంతో ఆ చిత్రాన్ని పంపిణీ చేసిన చమ్రియా సంస్థ ప్రదర్శన శాలలకి ఒక షరతు పెట్టింది. తమ దగ్గర సింప్లెక్స్ ప్రొజెక్టర్, సౌండ్ బాక్స్ లు కొంటేనే లవకుశ ప్రింట్ ఇస్తామన్నారు. దాంతో ప్రదర్శనశాలల వారందరూ అవి కొనుక్కుని తమ మూకీ ప్రదర్శన శాలల్ని టాకీ శాలలుగా మార్చేశారు. ఆ రకంగా తెలుగునాట టాకీ ప్రదర్శన శాలల ఆవిర్భావానికి తొలి లవకుశ దోహదపడింది.
Search Amazon.com Music for telugu film
Search Amazon.com for telugu film
Vol. No. 01 Pub. No. 263
Subscribe to:
Post Comments (Atom)
ప్రాచుర్యం
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
No comments:
Post a Comment