మహాకవి శ్రీశ్రీ గారి సినీ రంగ ప్రవేశం 1950 సంవత్సరంలో ' ఆహుతి ' అనే డబ్బింగ్ చిత్రంతో జరిగింది. ' నీరా ఔర్ నందా ' అనే హిందీ చిత్రానికి అనువాదం ఈ చిత్రం. అంతకుముందు దశాబ్దం క్రితం వచ్చిన ' కాలచక్రం ' ( 1940 ) చిత్రంలో శ్రీశ్రీ గారి మహాప్రస్థానం గీతం వున్నా ఆది ఆ సినిమా కోసం రాసిన గీతం కాదు. అందుకని ఆహుతిలో రాసిన ' ప్రేమయే జనన మరణ లీల........ ' అనే పాటే శ్రీశ్రీ గారి మొదటి చిత్ర గీతం అవుతుంది. ఈ పాట గురించి విశేషాలేమిటో, అసలు సినిమాకు పాటలు రాయడం అనేది ఎంత కష్టమో మహాకవి మాటల్లో.......
సినిమాకు పాటలు రాయడం చాలామంది అజ్ఞానులనుకునేటంత సులభం కాదు. ఇక డబ్బింగుకు రాయడమనేది మరీ కష్టంతో కూడుకున్న పని. ఉదాహరణకు " ప్రేమయే.. " అన్న పాటనే తీసుకుందాం. హిందీలో దీని పల్లవి- " ప్రేమ్ హై జనమ్ మరణ్ కాఖేల్ ... " . ట్యూన్ ప్రకారం ఇది " ప్రేమ్ హై - జనమ్ మరణ్ - కాఖేల్ " అని విరుగుతుంది. ఇందులోని ఆఖరి " కాఖేల్ " చాలా యిబ్బంది పెట్టింది. " ప్రేమయే జనన మరణ ఖేల " ( గాథ, క్రీడ ) అని రాశాను. గాని " లీల " అనే మాట మొదట్లో స్పురించలేదు. ఆ రాత్రి కలత నిద్రలో రాజేశ్వరరావు ట్యూన్ మననం చేసుకుంటూ వుంటే " ప్రేమయే జనన మరణ లీల " అనే పల్లవి దొరికింది. మర్నాడు పాటంతా పూర్తి చేశాను.
శ్రీశ్రీగారి సినిమా పాటల సంపుటి ' పాడవోయి భారతీయుడా ! ' నుంచి,
Vol. No. 01 Pub. No. 252
2 comments:
మహాకవి శ్రీశ్రీ గారి గురించి చాలా చక్కని విషయం చెప్పారు...థాంక్స్!
ధరణి రాయ్ గారూ !
ధన్యవాదాలు
Post a Comment