Saturday, April 17, 2010

నవ్వుల విషాదం

 నవ్వులోనే విషాదం
విషాదంలోనే వినోదం
ఒక కంట హాస్యం
మరోకంట విషాదం
నటనకు మాటలక్కరలేదు 
నటనకు హావభావాలుంటే  చాలు

నటనే జీవితంగా మలచుకొన్న మహానటుడు 
నవ్వులరేడు చార్లీ చాప్లిన్ జన్మదినం  ( ఏప్రిల్ 16 ) సందర్భంగా నీరాజనాలర్పిస్తూ.......



Vol. No. 01 Pub. No. 257

3 comments:

జయ said...

చార్లీచాప్లిన్ ఇష్టంలేనిదెవరికి. నేను కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నిన్ననే ఒక మూవీ చూసాను కూడా మరి.

Saahitya Abhimaani said...

చార్లీ చాప్లిన్ సినిమా ది గ్రేట్ డిక్టేటర్ లో ఆయన కనబరిచిన అద్భుత నటన. హిట్లర్ మీద పేరడీ కారెక్టరు, ఆపైన యూదు మంగాలిగా అసమానమైన ప్రతిభ కనబరిచారు. హిట్లర్ లాగ ఎంత స్వతఃసిద్ధంగా మాట్లాడారు. దీని గురించి ఒక కథ విన్నాను. ఈ సినిమా చూసి, క్రుద్ధుడై హిట్లర్ చార్లీ చాప్లిన్కు మరణ శిక్ష విధించాడుట ఇది తెలుసుకున్న చాప్లిన్ లండన్ నగర వీధులలో బోర విరుచుకుని నడిసువాదట, నన్నెవరు చంపుతార్ర అని చాలెంజి చేస్తూ.ఇందులో నిజమెంతో హైప్ చేసినది ఎంతో నాకు తెలియదు. కాని దురదృష్టవంతుడు, తోటి దెస ప్రజలు ఆయన్ను అర్ధం చేసుకోలేదు. కమ్యూనిస్టు అని తరిమి కొట్టారు. చివరకు స్విట్జర్లాండులో 1976 మరణించాడు. ఆయన పుట్టినరోజున ఆయనను తలుఇచుకుని ఆనందిస్తే ఆయన ఆత్మకు తప్పకుండా శాంతి కలుగుతుంది.

SRRao said...

* జయ గారూ !
ధన్యవాదాలు. అదృష్టవంతులు. నా దగ్గర చార్లీ చాప్లిన్ కలెక్షన్ వున్నా నిన్న మళ్ళీ చూడాలన్న కోరిక తీరలేదు. ఆయన మీద ఒక మంచి ఆర్టికల్ రాసి నా అభిమానాన్ని చాటుకోవాలని చాలా కాలంగా ఎదురుచూసా ! అది కూడా తీరలేదు. పనుల ఒత్తిడి, సమయాభావం వలన చాప్లిన్ మీదేకాదు బళ్ళారి రాఘవ, కందుకూరి వారిమీద కూడా ఇలా సరిపెట్టాల్సివచ్చింది - అదీ ఒక రోజు ఆలస్యంగా !

* శివ గారూ !
ప్రపంచానికి నవ్వులు పంచిన చాప్లిన్ జీవితం నిండా విషాదమే ! హిట్లర్ విషయంలో మీరు చెప్పిన విషయం నిజం కాదనుకుంటాను. ఆయన జీవిత చరిత్రలలో కూడా ఈ విషయం కనబడదు. ఏది ఏమైనా ఆ చిత్రం ఆయనకు చాలా కష్టాలు తెచ్చిపెట్టడం మాత్రం నిజం.
పైన జయ గారికిచ్చిన సమాధానంలో వివరణ ఇచ్చాను. వీలువెంబడి ఈ ముగ్గురి గురించి మరిన్ని వివరాలతో రాస్తాను. మీకిష్టమైన ' ది గ్రేట్ డిక్టేటర్ ' చిత్రం నుంఛి ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఇంకొంచెం ఆలస్యంగా కలిపాను. తిలకించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం