Thursday, April 8, 2010

కిడ్నాప్

డబ్బుకోసం ధనవంతుల పిల్లల కిడ్నాప్ 
కక్ష తీర్చుకోవడానికి కావాల్సిన వాళ్ళ కిడ్నాప్
ఎన్నికల్లో గెలవడానికి ప్రత్యర్థి కిడ్నాప్
రాక్షస వివాహానికి నచ్చిన అమ్మాయి కిడ్నాప్
అప్పు రాబట్టుకోవడానికి బాకీదారుల కిడ్నాప్
............... ఇలా కిడ్నాప్ లలో ఎన్నో రకాలు

కానీ ఇదో కొత్త రకం కిడ్నాప్
విద్యా వ్యాపారుల దుర్మార్గాలకి పరాకాష్ట
ఫీజు కట్టలేదని అభం, శుభం తెలియని విద్యార్థిని స్కూల్ యాజమాన్యం నిర్బంధం.
ఫీజు కట్టనిదే ఇంటికి పంపబోమని తండ్రికి తెలియజేసిన ప్రైవేటు యాజమాన్యం.
మాకు డబ్బే ముఖ్యం..... మానవతా విలువలు ముఖ్యం కాదు
అని డంకా మీద దెబ్బ కొట్టి చెప్పిన విద్యా వ్యాపారులు
విద్య మన దేశంలో అందని ఫలమైపోయింది... అంగడి సరుకై పోయింది.
వెర్రి తలలు వేస్తున్న విద్యా వ్యాపారానికిది నిదర్శనం

గురువారం నాటి ఆంధ్రజ్యోతి లోని ఈ వార్త చూడండి.

Vol. No. 01 Pub. No. 247

3 comments:

జయ said...

అవునండీ, ఇవాళ ఈ న్యూస్ చదవంగానే చాలా భయమేసింది. ఈ విద్యా సంస్థలు ఏ స్థాయికి వెళ్ళిపోతాయో.

ఆ.సౌమ్య said...

ఇదేమి ప్రారాబ్ధమో :(

SRRao said...

* జయ గారూ !
* సౌమ్య గారూ !
నిజంగానే భయంగా వుందండీ ! తల్లిదండ్రులే దీనికి పరిష్కారం చూసుకుంటే మంచిదేమో ! ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం