Thursday, April 8, 2010

రాలిపోయిన మరో కథా కుసుమం

" చదవండి..చదవండి..చదవండి.. ఇదే నేటి యువతకు నేనిచ్చే సందేశం. ప్రసిద్ధ రచయితల జీవిత చరిత్రను, వారి జీవన గమనాన్ని అధ్యయనం చేయండి. నేను చేసింది అదే........ " - భరాగో

సున్నితమైన హాస్యం ఆయన సొంతం
సునిశితమైన పరిశీలన ఆయన పథం
తెలుగు కథా వినీలాకాశంలో మిగిలివున్న తారల్లో ఒక తార
తెలుగు సాహిత్య ఉద్యానవనంలో విరబూసిన కథాకుసుమం
ఆ తార రాలిపోయింది
ఆకాశం చిన్నబోయింది
ఆ కుసుమం వాడిపోయింది
ఉద్యానవనం బోసిపోయింది

" ఈ ప్రపంచం ఎంత అందమైనది ! దీని అందాన్ని నా మరణం తరవాత కూడా ఆస్వాదించగలనా ? నేను వెళ్ళే ఆ మరోప్రపంచంలో ఆపాత మధురమైన పాటలను ఆలకించలేనా ? ఏమో ? నా కోరిక నెరవేరుతుందేమో ? ప్రపంచంలో ఉన్నవి, ఉండేవి మూడే మూడు. అవి అందం, ఆనందం, మాధుర్యం. అవి ఎక్కడ ఉన్నా వాటిని అన్వేషించటమే మన పని.... "
అంటూ వెళ్ళిపోయారు రచయిత భరాగో

ఈ ప్రపంచం యొక్క అందాన్ని తప్పకుండా ఇక ముందు కూడా చూడగలరు
ఆపాత మధురమైన పాటల్ని తప్పకుండా ఇక ముందు కూడా ఆలకించగలరు
ఆనందాన్ని అక్కడ కూడా అన్వేషించగలరు... ఎందుకంటే ఆయన నిత్యాన్వేషి
ఆయన అన్వేషణ ఫలించాలని..... ఆయన ఆత్మకు శాంతి కలగాలని.... కోరుకుంటూ....


గమనిక : రాజేంద్రకుమార్ దేవరపల్లి గారు పంపిన ' భరాగో ' గారి అంతిమ యాత్ర చిత్రాలు ఇక్కడ చూడండి.

Vol. No. 01 Pub. No. 246

6 comments:

Unknown said...

మీతో పాటు నా శ్రద్ధాంజలి తెలుపుతూ ....
కాలం తీరిపోయి ఆ కుసుమం వాడిపోయి రాలిపోయిన,
మీలాంటి సాహిత్య ప్రేమికులు వున్నంతకాలం,
చిరకాలం తేనేలను చిలికిస్తునే వుంటుంది

ఆ.సౌమ్య said...

నేను వినకూడదు అనుకుంతున్న మాట ఇది. ఆయన ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో ఉన్నారు అని తెలిసినప్పటినుండి హృదయం రెట్టింపువేగంతో కొట్తుకుంతూనే ఉంది ఎక్కడ అశుభ వార్త వినాల్సి వస్తుందో అని.
ఆయన కథలు మరువరానివి, మరువలేనివి.

Rajendra Devarapalli said...

భరాగో- భమిడిపాటి రామగోపాలం అంతిమయాత్ర చిత్రాలు ఇక్కడ చూడగలరు
http://wp.me/pPLDz-Up

ఆ.సౌమ్య said...

ఏంటండీ ఫొటోలు పెట్టి మరీ ఏడిపించేస్తున్నారు మీరు....నాకు కన్నీళ్ళు ఆగట్లేదు :(

Anonymous said...

పండుటాకు రాలిపోవటం సహజం. ఆయన గొప్పరచయిత. కానీ ఆ బొమ్మ చూస్తే scary గాఉంది.

SRRao said...

స్పందించిన అందరికీ ధన్యవాదాలు. మీ అందరి శ్రద్దాంజలులు ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చాలని కోరుకుంటూ.....

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం