Monday, October 19, 2009

నిర్విచారం


కరువు విలయ తాండవం చేస్తోందట
నిజమే ! చెయ్యనీ ఏం చేస్తాం !!

వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయట
నిజమే ! సృష్టించనీ ఏం చేస్తాం !!

భారీ తుఫానులు, భూకంపాలూ వస్తున్నాయట
నిజమా ! రానీ ఏం చేస్తాం !!

ధరలు
భారీగా పెరుగుతున్నాయ
నిజమా ! పెరగనీ ఏం చేస్తాం !!

వేతనాల్లోను, జీతాల్లోను కోతలుంటాయట
నిజమా ! ఉండనీ ఏం చేస్తాం !!

మధ్యంతర ఎన్నికలు రావచ్చట
నిజమా ! రానీ ఏం చేస్తాం !!

ఏం చెయ్యగలం ? మన రాత ఎలావుంటే అలాగే జరుగుతుంది
ఒక వైపు విచారం మరోవైపు నిర్విచారం ! వీటి ప్రతి రూపమే సామాన్యుడు !!

3 comments:

చిలమకూరు విజయమోహన్ said...

అలా అనుకోవడంకన్నా చేసేదేమీలేదు ప్రస్తుత పరిస్థితుల్లో.
Word verification తీసివేస్తే బాగుంటుంది.

SRRao said...

విజయమోహన్ గారూ !
ధన్యవాదాలు. బ్లాగు లోకంలో సాంకేతికాంశాల విషయంలొ ఇంకా శైశవ దశలోనే ఉన్నాను. Word verification అంటే అర్థం కాలేదు. కిందటి టపాలోనే చెప్పారు. అప్పుడే అడిగాను. బహుశా మీరు గమనించి ఉండకపోవచ్చు.దయచేసి ఏం చెయ్యాలో వివరంగా చెబితే సరిదిద్దుకుంటాను.

SRRao said...

విజయ మోహన్ గారూ !
మొత్తానికి Word verification ని కనిపెట్టాను. తీసివేసాను. గమనించగలరు,

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం