Wednesday, October 28, 2009

శ్రమ విలువ

శ్రమ విలువ తెలుసుకొన్న వాళ్ళు మహాత్ములవుతారు. ఒకప్పటి సోవియట్ రష్యా లో ఒకరోజు ఒక రైల్వే స్టేషన్ లో ఒకావిడ దిగింది. ఆ స్టేషన్ కి దగ్గరలో ఉన్న ఒకరికి ఆమె ఒక సమాచారాన్ని పంపించాలి. ఆ రైలు ఆ స్టేషన్ లో పది నిముషాలు మాత్రమే ఆగుతుంది. ఎవరి చేత పంపాలా అని ఆలోచిస్తుండగా ప్లాట్ ఫాం మీద తిరుగుతూ బికారిలాగ కనిపిస్తున్న ఒక వ్యక్తి కనిపించాడు. ఆవిడ అతన్ని పిలిచి తన దగ్గరున్న ఉత్తరాన్ని ఇచ్చి తను చెప్పిన వ్యక్తికి ఇచ్చి వస్తే రెండు రూబుళ్ళు ఇస్తానని అంది. దానికా వ్యక్తి సరేనని తీసుకెళ్ళి ఇచ్చి వచ్చాడు. అన్న మాట ప్రకారం ఆవిడ ఆ డబ్బు ఇచ్చేసింది. ఆవిడకు అతన్ని ఎక్కడో చూసినట్లనిపించింది. తిరిగి రైలు ఎక్కాబోతూండగా గుర్తుకొచ్చింది.అతనెవరో! వెంటనే పరుగెత్తి అతన్ని కలిసింది. పరికించి చూసింది. తన అనుమానం నిజమైందని అర్థమవగానే ఖంగారు పడింది. పశ్చాతాప్తపడింది. క్షమాపణ కోరింది. తనిచ్చిన డబ్బుని తిరిగి ఇచ్చివేయమంది. కానీ ఆయన ఒప్పుకోలేదు. పైగా " మీరు చెప్పిన పని చెప్పిన ప్రకారం చేసాను. నా శ్రమకు తగ్గ ఫలితం మీరు నాకు ఇచ్చారు. నాపని మీకు నచ్చకపోతే చెప్పండి. తిరిగి ఇచ్చేస్తాను. అంతే కానీ నా శ్రమ పడి సంపాదించుకున్న ఈ డబ్బు ఇవ్వను " అన్నాడాయన. ఇంతకీ ఆ మహానుభావుడు ఎవరో ఇక్కడ చూడండి.


4 comments:

Anonymous said...

meeru ichina player lo video work kavatam ledu

SRRao said...

Annonymous గారూ !
విడియో సమస్యను తెలిపినందుకు కృతజ్ఞతలు. మార్చాను. చూడండి. ఇలాంటి సమస్య ఏదైనా వచ్చినపుడు సహృదయులైన మితృలు తెలియజేస్తే సరిజేసుకుంటాను. మిగిలినవి కూడా మారుస్తాను. గమనించగలరు. ఒక్క విషయం. ఇంత సాయం చేసి మీరు అజ్జ్ఞా తంలో ఉండిపోవడం బాగులేదు. దయజేసి మీ పేరు తెలియజేస్తే సంతోషిస్తాను.

భావన said...

wow ఎంతైనా నేర్చుకోవచ్చు గొప్ప వాళ్ళను చూసి..

SRRao said...

నిజం భావన గారూ ! ఇలా తల్చుకోవడం వలన నేను, చదవడం వలన మిత్రులు ఈ విషయాల గురించి ఒక్కసారైనా ఆలోచించగలుగుతామేమోననే చిన్ని ఆశ.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం