Thursday, October 29, 2009

సైకో


పై సన్నివేశం ' సైకో ' ఆంగ్ల చిత్రంలోనిది. ఆ చిత్ర సృష్టికర్త అల్ఫ్రెడ్ హిచ్ కాక్ అని సినిమా ప్రేమికులకు వేరే చెప్పనవసరం లేదు. భయానక దృశ్యాలు, సస్పెన్స్ సంఘటనలు అనగానే ప్రపంచమంతటికీ గుర్తుకొచ్చేది హిచ్ కాకే ! ఈ బాత్ రూం మర్డర్ దృశ్యాన్ని ఇంత భయంకరంగా చిత్రించగలిగేది హిచ్ కాక్ కాక మరెవరు? అనేది సాధారణంగా అందరి అభిప్రాయం.

కానీ ఈ దృశ్యాన్ని మాత్రం ఆయన చిత్రీకరించలేదు. ఇది నిజం! హిచ్ కాక్ జీవిత చరిత్ర రాస్తున్న డోనాల్డ్ స్పాటో న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ఈ విషయం గురించి వివరించారు. హిచ్ కాక్ దగ్గర గ్రాఫిక్ డిజైనర్ గా పని చేసే శామ్యూల్ బాస్ అనే అతను ' సైకో ' చిత్ర కథా చర్చల్లో పాల్గొనేవాడు. ఆ చర్చల్లో ఈ సన్నివేశం చిత్రీకరణ విధానాన్ని అతను తన సృజనాత్మకతను జోడించి వర్ణించాడు. అది హిచ్ కాక్ కి నచ్చింది. అందుకే ఆ దృశ్య చిత్రీకరణను శ్యామ్యూల్ కే అప్పగించి తను పరిశీలిస్తూ ఉండిపోయాడు. అలా సంచలనం సృష్టంచిన ఆ సన్నివేశం హిచ్ కాక్ చేతిలో కాక అతని శిష్యుని చేతిలో రూపు దిద్దుకుంది. ఈ విషయం గురించి శ్యామ్యూల్ వివరిస్తూ ' శిష్యులకి ఎలా శిక్షణ ఇవ్వాలో , వారినెలా తీర్చిదిద్దాలో మా గురువుగారికి బాగా తెలుసు. అందుకే చివరిదాకా మేము ఆయన్ని వదలి వెళ్ళలేదు ' అన్నాడు. గురువులకే పంగనామాలు పెట్టే శిష్యులున్న ఈ రోజుల్లో ఇలాంటి శిష్యుల్ని సంపాదించుకున్న హిచ్ కాక్ ఎంత అదృష్టవంతుడో కదా !

*
సినిమాల్లో సస్పెన్స్ గురించి హిచ్ కాక్ వ్యాఖ్య " సినిమాలో అకస్మాత్తుగా బాంబు పేలితే అది ఆశ్చర్యం. కానీ మరో అయిదు నిముషాల్లో పేలబోతోందని ప్రేక్షకులకు తెలిసి, ఆ చిత్రంలోని హీరో కి మాత్రం తెలియకపోతే అది సస్పెన్స్ "

3 comments:

Anonymous said...

ee cinema ni manavallu telugu lo ee madyane teesaru . INDUMATI anukunta ..

మంచు said...

హిచ్ కాక్ సినిమాల్లొ ఎక్కువ సస్పెన్స్ సీన్లు వుంటాయి కానీ భయానక సీన్స్ (వయొలన్స్) మాత్రం తక్కువ.. ఇప్పుడు సీమ సినిమాలు చూసే చిన్నపిల్లలు కూడా ఈ సినిమాలు చూసేయవచ్చు...
హిచ్ కాక్ సినిమాల్లొ నచ్చె ఇంకొ అంశం హాస్యం..
హాస్యం , సస్పెన్స్ మిళితం చెయ్యడం కస్టం.. సైకో లొ కామెడి వుండదు కానీ.. మిగతా హిచ్ కాక్ సినిమాల్లొ బావుంటుంది..
Best comedy in North by Northwest.

అయిదు సార్లు ఆస్కార్ కి నామినెట్ అయినా పాపం ఒక్క సారి రాలేదు.. అయినా ఇప్పటికి అయనే No. 1

SRRao said...

@Anonymous గారూ !
@ మంచుపల్లకీ గారూ !
కృతజ్ఞతలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం