Friday, October 16, 2009
జ్ఞాపకావళి
ఈ దీపావళి జ్ఞాపకావళిగా మారిపోయింది. జ్ఞాపకాల పొరలలో నిక్షిప్తమైన మధురానుభూతుల్ని వెలికి తెచ్చింది. మనుష్యుల మధ్య అనుబంధాలు, ఆప్యాయతల్ని పెంచి, అదే సమయంలో మంచీ చెడూ విచక్షణా జ్ఞానాన్ని పంచడమే పండుగల పరమార్థం. ఉద్యోగరీత్యా, వృత్తిరీత్యా ఇంటికీ, ఊరికీ, ఇంకా ఆప్తులికీ దూరంగా ఉండాల్సివచ్చినపుడు ఈజ్ఞాపకాలే మనకి ఆప్తులు. మనసుకి బాధగా ఉన్నప్పుడు చుట్టూ ఎంతమంది ఉన్నా ఒంటరితనమే ! అలాంటప్పుడు ఈ జ్ఞాపకాలే మనకి తోడుగా ఉండి ఒంటరితనాన్ని మరిపిస్తాయి. మన సంస్కృతికి గొప్పతనమది. మిత్రులకు, ఆప్తులకు శుభాకాంక్షలందించడం, అంతా ఒకచోట చేరి విందు వినోదాలతో కాలక్షేపం చెయ్యడం, మనకి తోచినంతలో మన కిందివారికి సాయం చెయ్యడం ఇవన్నీ సమాజంలో సుహృద్భావ వాతావరణాన్ని పెంచుతాయి. మనం వంటరి కామని, మన చుట్టూ సమాజం ఉందని గుర్తుచెయ్యడం ద్వారా మనలో ఒక భద్రత కలిగించండం మన పండగల ప్రత్యేకత. వీటన్నిటివల్లా మానసికోల్లాసం కూడా పుష్కలంగా అందుతుందనటంలో సందేహం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కొంత భాగం కష్టాలలో మునిగిఉంది. ధరలరూపంలో మిగిలిన రాష్ట్రమంతా మరో కష్టంలో మునుగుతోంది. ఆడంబరంగా కాక ఆనందంగా ఈ దీపావళి జరుపుకుందాం ! బాధితులకు కూడా మనకి వీలైనంత ఆనందాన్ని పంచుదాం ! అయితే తమ డాబూ దర్పాలూ ప్రదర్శించడానికి ఈ పండగల్ని వేదికగా చేసుకునే వాళ్లు కొందరుంటారు. వాళ్ళని చూసి జాలి పడదాం !!
చిన్నప్పటి దీపావళి జ్ఞాపకాలూ చాలానే ఉన్నా ఈ సంవత్సరం మాత్రం నా జీవితంలో మరో కొత్త తీపి జ్ఞాపకం చేరింది. మరో కొత్త ప్రపంచాన్ని చూపించింది. ఎంతోమంది కొత్త మిత్రుల్ని అందిస్తోంది. ఎక్కడెక్కడి ఊసులు ! ఎన్నెన్ని భావనలు !! అన్నిటినీ ఒకచోట చేర్చిన అందమైన వేదికనందించిన ఈ దీపావళిని నేనెలా మరచిపోగలను. అందుకే ఈ దీపావళి నాకు మధురమైన జ్ఞాపకావళిగా మారిపోయింది. ఈ భాగ్యాన్ని కలిగించిన మిత్రులందరికీ పేరు పేరునా నా
శుభాకాంక్షలు
లేబుళ్లు:
శుభాకాంక్షలు
Subscribe to:
Post Comments (Atom)
ప్రాచుర్యం
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
2 comments:
ఈ మాట నిజమండి...ఈ బ్లాగ్ ప్రపంచం మనకు అందించిన ఆనందంతో ఈ దీపావళి మరింత దేదీప్యమానంగా కనబడుతోంది...శుభాకాంక్షలు.
తృష్ణ గారి మాటే నాదీనూ!!
దీపావళి పండుగ శుభాకాంక్షలండి..
Post a Comment