చమత్కారాలు
మహాకవి శ్రీశ్రీ రచనల్లో విప్లవం దాగున్నట్లే మాటల్లో శ్లేషలు తొంగిచూసేవి. మచ్చుకి కొన్ని....
* వల్లం నరసింహారావు రంగస్థల నటుడు. కొన్ని సినిమాలల్లో కూడా నటించాడు. ఆయన ఒక సాయింత్రం మదరాసు లోని పానగల్ పార్క్ లో శ్రీశ్రీ ని చూసి " గురువు గారూ ! ఓ నాటిక రాసి పెట్టండి " అని అడిగాడు. దానికి శ్రీశ్రీ " అలాగే తప్పకుండా ! ఏ నాటికైనా రాసి పెడతాను " అన్నారు.
* మొక్కపాటి నరసింహారావు గారు ప్రముఖ రచయిత. ఆయనా, శ్రీశ్రీ గారూ ఒకసారి రైల్వే స్టేషన్ లో కలుసుకున్నారు. మొక్కపాటివారు అడిగారు " ఊరికేనా ? " అని. అందుకు శ్రీశ్రీ " అవును. ఊరికే !! " అన్నారట.
* ఒకరోజు శ్రీశ్రీ తన మిత్రుడైన ఒక పత్రికా సంపాదకుడిని కలుద్దామని పత్రికాఫీసుకెళ్ళారు. తాజా సంచికకు ముఖచిత్రం ఏం వెయ్యాలా అని ఆలోచిస్తున్న ఆ సంపాదకుడు శ్రీశ్రీని చూడగానే " ముఖచిత్రంగా కొచ్చిన్ సిస్టర్స్ ని వేస్తే ఎలా ఉంటుంది ? " అని అడిగాడు. అందుకు శ్రీశ్రీ వెంటనే " ఎందుకొచ్చిన సిస్టర్స్ ? ఆకలేస్తోంది. ముందు భోజనానికి వెడదాం ! రా ! " అన్నారు.
6 comments:
బాగున్నాయండీ నాకాలపు హాస్యం. ఇలాటి చమత్కారాలు ఈమధ్య ఎక్కడా చూడ్డంలేదు.
ఇలాటి చమత్కారాలమధ్య ఆడియో ప్రకటనలు మాత్రం మొత్తం మూడ్ ని పాడుచేసే అవకాశం వుందండీ. మీబ్లాగు మీయిష్టంలెండి.
రావుగారూ, నాపై వ్యాఖ్యలో నేను ప్రస్తావించిన ప్రకటన మీబ్లాగువల్ల కాదేమో. నాకంప్యూటరువల్లేనేమోనని ఇప్పుడే తోచింది. క్షమించండి
బాగున్నాయి చమత్కారపు మెరుపులు. ఎవరిది అండీ ఆ గొంతు రేడియోలో ...? గాంధి గారిదా?
తెలుగు తూలిక గారికి, భావన గారికి
మహాత్మాగాంధీ ప్రసంగంలోంచి కొన్నిభాగాలు. అంతర్జాలంళో శోధిస్తుంటే దొరికింది. మిత్రులకోసం బ్లాగులో పేట్టాను.
మంచి టపా అండీ.
శ్రీశ్రీ గారు, విశ్వనాధ వారు మరియు ఇతర ప్రముఖుల చలోక్తులు, మృణాలిని గారు వ్రాసిన "తెలుగు ప్రముఖులు - చమత్కార భాషణలు" పుస్తకం అంతర్జాలంలో ఈ క్రింది లంకె లో దొరుకుతుంది.
http://www.archive.org/details/TeluguPramukuluChamathkaraBashanalu
వెంకటరమణ గారూ 1
కృ తజ్ణతలు. మీరు సూచించిన లింకు తప్పకుండా చూస్తాను.
Post a Comment