Friday, August 27, 2010

మహాలక్ష్మి - శ్రీరంజని

అలనాటి నటి శ్రీరంజని మేటి నటిగా వెలుగుతున్న కాలంలో జబ్బు పడడంతో తన భర్త నాగమణికి మళ్ళీ పెళ్లి చెయ్యాలని సంకల్పించింది. తన తల్లిదండ్రుల సమ్మతంతో చెల్లెలైన మహాలక్ష్మినిచ్చి తన భర్తకు మళ్ళీ పెళ్లి చేసింది. ఇది 1940 వ సంవత్సరంలో జరిగింది.

శ్రీరంజని వారసురాలిగా మహాలక్ష్మిని మొదట గుర్తించింది అప్పటి మేటి దర్శకుడు చిత్రపు నారాయణ మూర్తి గారు. 1944 లో  తన భీష్మ చిత్రంలో సత్యవతి పాత్రనిచ్చి తెలుగు చిత్ర ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ చిత్రాన్ని విడుదల చేసిన చమ్రియా టాకీస్ వారు మహాలక్ష్మి పేరును జూనియర్ శ్రీరంజని గా మార్చారు.

ఆ తర్వాత గొల్లభామ, గృహప్రవేశం, బ్రహ్మరథం, మదాలస వంటి చిత్రాల్లో నటించారు. 1949 లో కదిరి వెంకట రెడ్డి దర్శకత్వంలో వచ్చిన  గుణసుందరి కథ లో  గుణసుందరి పాత్ర  ఆమెకు స్టార్ హోదా కల్పించిందని చెప్పవచ్చు. దాంతో ఆమె అనేక తెలుగు చిత్రరంగంలోనే కాక తమిళ చిత్రరంగంలో కూడా ప్రముఖ నటిగా వెలుగొందారు.  1960 వరకూ పూర్తిస్థాయిలోను, ఆ తర్వాత 1974 వరకూ అడపాదడపా అతిథి పాత్రల్లోనూ నటించారు. మూడు దశాబ్దాలు కొనసాగిన ఆమె సుదీర్ఘ నట ప్రస్థానం 1974 లో ఆగష్టు 27 వ తేదీన ముగిసింది.

జూనియర్ శ్రీరంజని వర్థంతి సందర్భంగా ఆమెను స్మరించుకుంటూ............



Vol. No. 02 Pub. No. 014

2 comments:

Vinay Datta said...

దాంతో ఆమె అనేక తెలుగు చిత్రరంగంలోనే కాక తమిళ చిత్ర...?

Pls post a pic of senior Sreeranjani. I donot know if I had seen her.

SRRao said...

మాధురి గారూ !
సీనియర్ శ్రీరంజని స్టిల్ నా దగ్గర ఏదో పత్రికలో వున్నట్లు గుర్తు. 1939 లోనే ఆమె కెరీర్ ముగిసిపోవడంతో అప్పటి స్తిల్ల్స్ దొరకడం కష్టం. నెట్ లో ఒక స్టిల్ వుంది. ఆ లింక్ ఇస్తున్నాను. చూడండి. దొరికితే నా దగ్గరవున్నది కూడా మరోసారి శిరాకదంబంలో ఇస్తాను.

http://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Sriranjani_senior.jpg

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం