తెలుగులో ' సత్య హరిశ్చంద్ర ' నాటకాలు చాలా వచ్చాయి. వాటిలో మేటిగా నిలిచింది మాత్రం బలిజేపల్లి లక్ష్మీకాంతకవి రచించిన నాటకమే ! అందులోని సంభాషణలు, పద్యాలు నేటికీ సజీవంగానే వున్నాయి. నాటకరంగంలో పేరు తెచ్చుకున్న నటులు, ఇతర కళాకారులతో బాటు రచయితలు కూడా తొలి రోజుల్లో చిత్రరంగానికి వచ్చారు. నాటకరంగంతో బాటు ఆ రంగాన్ని కూడా సుసంపన్నం చేసారు. బలిజేపల్లి వారు కూడా ఆ కోవలోకే వస్తారు.
గుంటూరు హిందూ కళాశాలలో తెలుగు అథ్యాపకులుగా, కర్నూలు రిజిస్ట్రార్ ఆఫీసులో హెడ్ గుమాస్తాగా పనిచేసిన బలిజేపల్లి వారు అందరూ బాలలతో నిర్మించిన ' ధ్రువ - అనసూయ ' తో బాటు విజయదశమి, జరాసంధ, మార్కండేయ, వరవిక్రయం, మైరావణ, మళ్ళీపెళ్ళి, బాలనాగమ్మ, గరుడ గర్వభంగం, తాశిల్దారు, సీతారామజననం, భీష్మ, ముగ్గురు మరాఠీలు, మదాలస, కృష్ణప్రేమ వంటి చాలా చిత్రాలకు మాటలు, పాటలు రాసి తన సాహిత్య సుగందాల్ని చిత్రరంగానికి కూడా అందించారు.
లక్శ్మీకాంతకవి గారు మంచి రచయితే కాదు... మంచి నటులు కూడా ! ' వరవిక్రయం ' చిత్రంలో ఆయన ధరించిన పిసినారి సింగరాజు లింగరాజు పాత్ర చెప్పుకోదగ్గది. ' భూకైలాశ్ ' చిత్రంలో పౌరాణిక భాషను వ్యావహారికంలోకి మారుస్తూ ఆయన చేసిన ప్రయోగం ఆ తర్వాత వచ్చిన పౌరాణిక చిత్రాలలో రచనకు ఆదర్శంగా నిలిచింది.
బలిజేపల్లి వారి సాహిత్యంలో గాలిపెంచల సంగీతం నిర్వహించిన టంగుటూరి సూర్యకుమారి పాడిన ' కృష్ణప్రేమ ' చిత్రంలోని ఓ మధురగీతం .....
Vol. No. 02 Pub. No. 214
2 comments:
Sathya Harischandra natakam maa thathayyatho kalisi chinnappudu Ravindrabharathilo chusanu..Apude thathayyagaru Lakshmi Kantha kavi aa natakamlo padyalau asarani..ade padyalanu Rajyam pictures vaari Harischandra(1956) movielo kuda yatha thadhamga vadarani.. aa movie super hit ayyaindani. Vijayavaru 1965 lo Sathya Harischandra K.V Reddy directionlo theeyaga , padyalanu Pingali Nagadra Rao rasarani.. kaani Balijepalli vaari padyalla ivi poular kaadani chepparu.
దీప గారూ !
మీ చిన్నప్పటి అనుభూతుల్ని ఈ సందర్భంగా పంచుకోవడం చాలా ఆనందంగా వుంది. అలాగే ఇంకా ఏమైనా ఇలాంటి అనుభూతులు అందించగలిగితే మరింత సంతోషం. ధన్యవాదాలు.
Post a Comment