Friday, April 22, 2011

భూమాతకు వందనం

భూమాతకు వందనం
కరుణామయికి వందనం

నీలో స్వార్థం లేదు...
నీకు వివక్షత లేదు...

ఈ విశ్వంలోని ప్రతీ ప్రాణీ నీ సంతానమే ! 
నీ సృష్టిలోని పిల్లలందరూ నీకు సమానమే !

అందుకే అందరికీ సమానంగానే సంపదను అందించావు
అందుకే అందరి ఆకలినీ సమానంగానే తీర్చాలనుకున్నావు

కానీ నువ్విచ్చిన ఆహారం మాలో స్వార్థాన్ని పెంచింది
నువ్విచ్చిన సంపద మాలో మత్సరాన్ని పెంచింది

బలం కలవాడిదే రాజ్యమైంది
ముందుగా వాడి ఆకలి తీరింది

బలహీనుడు ఆశక్తుడయ్యాడు
ఎప్పటికీ వాడి ఆకలి తీరదు

మానవత్వం కంటే ధనం విలువ పెరిగింది
దానికోసం అడ్డదారులు తొక్కుతున్నారు

నువ్విచ్చిన అమూల్యమైన సంపద సహజవనరులు
అవన్నీ స్వార్థపరుల దౌష్ట్యానికి బలయిపోతున్నాయి

తాత్కాలిక సుఖాలకు ప్రాధాన్యం పెరుగిపోతోంది
శాశ్వత ప్రయోజనాలు కనుమరుగైపోతున్నాయి

అందుకేనేమో అప్పుడప్పుడు నీ ఉనికిని గుర్తు చేస్తున్నావు
ప్రళయాలు, భూకంపాల రూపంలో నీ బిడ్డల్ని శిక్షిస్తున్నావు

కానీ తల్లీ .. నీ ఆగ్రహ జ్వాలల్లో మాడిపోయేది అధికంగా సామాన్యులే
వారి సమాదుల్నే పునాదులుగా చేసుకునేది మళ్ళీ ఆ ' మాన్యులే '

ఈ స్వార్థపరుల్నీ, అవినీతిజలగల్నీ మాత్రమే మట్టు పెట్టే మంత్రమేదీ లేదా నీ దగ్గర
అమాయకులనీ, పీడిత జనాన్నీ వారి నుంచి రక్షించే మంత్రదండమేదీ లేదా నీ దగ్గర

ఉంటే వెంటనే బయిటకు తియ్యి తల్లీ ! నీకు వందనాలు !!
ఉంటే వెంటనే ప్రయోగించు తల్లీ ! నీకు శతకోటి వందనాలు !!

ప్రతీ మనిషి అవసరానికి సరిపడా భూమాత అందిస్తుంది 
కానీ అతని అత్యాశకు సరిపడా మాత్రం కాదు 
- మహాత్మాగాంధీ 




Vol. No. 02 Pub. No. 208

3 comments:

Unknown said...

sir mee blog bavundi...meku vilunnapudu na blog chusi me abhiprayam cheppagalaru
http:/kallurisailabala.blogspot.com

Unknown said...

http://kallurisailabala.blogspot.com

SRRao said...

శైలబాల గారూ !
ముందుగా నా బ్లాగు దర్శించినండుకు ధన్యవాదాలు. మీ బ్లాగు ఇంతకుముందే చూశాను. మీరు రాస్తున్న నవల మొదటినుంఛి చదివి అప్పుడు నా స్పందనను తెల్పాలనుకున్నాను. త్వరలోనే ఆ పని చేస్తాను.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం